స్వాతంత్య్ర వేడుకల్లో పవన్ సతీమణి లెజినోవా సందడి
కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్-లెజినోవా హాజరు, చేనేత చీరలో ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్.
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. ఈ వేడుకలకు ఆయన తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి హాజరవ్వడం అందరిని ఆకర్షించింది. రష్యన్ వనితయైన లేజినోవా నిండైన చేనేత చీరకట్టు..బొట్టుతో..జాతీయ జెండా చిహ్న ధారణతో హాజరైన తీరు వేడుకకు హాజరైన వారందరిని ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఓడితే ఒక న్యాయం..గెలిస్తే మరో న్యాయమా ?: ఓటు చోరీ ఆరోపణపై పవన్
వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ ఎంతోమంది మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్ర్యం అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు బలంగా ఉండాలని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలన బ్రిటిష్ చీకటి పాలనతో పోల్చారు. ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారని..గెలిచినప్పుడు ఒక న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవని..అవినీతి వారి హాయంలో సాధారణమైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని.. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో మేము పాలన కొనసాగిస్తున్నామనిన పవన్ కల్యాణ్ తెలిపారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేసి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి…
అమరావతిపై ‘నీళ్ల’ నీడలు! మూడేళ్లలో పూర్తయ్యేనా?
వేటాడే అంటువ్యాధుల ఆపద! వెన్నంటే సీజనల్ రోగాలు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram