Scrub Typhus : ఏపీలో స్క్రబ్ టైఫస్ పంజా..15 మందికి పైగా మృతి

ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 15 మంది మృతి చెందగా, 1806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో అత్యధికంగా 444 కేసులు వెలుగుచూశాయి.

Scrub Typhus : ఏపీలో స్క్రబ్ టైఫస్ పంజా..15 మందికి పైగా మృతి

అమరావతి : ఏపీలో స్ర్కబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తుంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ మరణాలు 15కు చేరుకున్నాయి. స్క్రబ్ టైఫస్ తో పాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య బారిన పడిన వారు ఎక్కువగా మరణించినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 9,236మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 1,806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైస్ వ్యాధి కట్టడిపై అధికార యంత్రాంగం సరైన దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప‌శువులు ఆవాసం ఉండే చోట చిగ్గ‌ర్ మైట్ అనే క్రిమి మ‌నుషుల‌ను కుట్ట‌డం ద్వారా స్క్ర‌బ్ టైఫ‌స్ సోకుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. కీట‌కం కుట్టిన ద‌గ్గ‌ర న‌ల్ల‌టి మచ్చ ఏర్ప‌డ‌టంతో పాటు వ్యాధి ల‌క్ష‌ణాలు మ‌లేరియాను పోలి ఉంటాయ‌ని చెబుతున్నారు. ప‌ల్లెల్లోనే వీటి కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.

ఇక రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 444 పాజిటివ్ కేసులు నమోదు కాగా కాకినాడ జిల్లాలో 183, విశాఖ 143, వైఎ స్సార్ కడప 118, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 113, విజయనగరం 96, తిరుపతి జిల్లా 90, గుంటూరు జిల్లా 85, అనంతపురం జిల్లాలో 83 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అనుమానిత మరణాలలో .. పల్నాడు జిల్లాలో మూడు, విజయనగరం, బాపట్ల జిల్లాలో రెండు కృష్ణా జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాల్లో రెండు మరణాలు సంభవించాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో ఒకటి చొప్పున మరణాలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి :

First Communist Conference : కోల్ కత్తాలో 24న మొదటి కమ్యూనిస్టు మహాసభల శతాబ్ధి ఉత్సవాలు
First Communist Conference : కోల్ కత్తాలో 24న మొదటి కమ్యూనిస్టు మహాసభల శతాబ్ధి ఉత్సవాలు