kavitha : సీఎం రేవంత్‌రెడ్డికి సంతోష్ రావు గూఢచారి

సంతోష్ రావు రేవంత్ రెడ్డికి గూఢచారి. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్‌ను ఉద్యమకారులకు దూరం చేసిన పాపం ఆయనదేనంటూ నిప్పులు.

kavitha : సీఎం రేవంత్‌రెడ్డికి సంతోష్ రావు గూఢచారి

విధాత, హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు గూఢచారి అని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆబ్కారీ కానిస్టేబుల్‌ సౌమ్యను పరామర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.

ఉద్యమకారులకు ఉద్యమనేత కేసీఆర్ ను దూరం చేసిందే సంతోష్‌రావు అని, ఆయన వల్లే గద్దర్‌లాంటి వాళ్లు ప్రగతిభవన్‌ గేట్‌ బయట ఉండాల్సి వచ్చిందని కవిత అన్నారు. ఈటెల రాజేందర్ వంటి వారు పార్టీ వీడాల్సిన పరిస్థితికి కూడా సంతోష్ రావు అనే మొదటి దయ్యమే కారణమని ఆరోపించారు. నేను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యమే సంతోష్ రావు అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో సగం ఇడ్లి తిన్నారా? పూర్తిగా ఇడ్లి తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రీకి చేరవేసేది సంతోష్ రావే అని, గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు. అందుకే ఆ గూఢచారిని శిక్షిస్తాడని నేను నమ్మటం లేదు అన్నారు. సంతోష్ రావు ను సిట్ పిలవటం మంచిదేనని, అయితే కానీ ఆయనకు శిక్ష పడటం అనుమానమే అన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీష్ రావు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదు అన్నారు.

నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా ఈ దుర్మార్గుడికి శిక్ష పడుతుంది అన్నారు.రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఒక్కోసారి మన నీడ కూడా మన కళ్లను కప్పే పరిస్థితి వస్తుంది అని, ఉద్యమకారులను కేసీఆర్ కి దూరం చేసిన పాపం కచ్చితంగా ఈ దుర్మార్గుడికి తగులుతుందవిమర్శించారు.

ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందని కవిత విమర్శించారు. డ్రగ్స్, గంజాయి లేని రాష్ట్రంగా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గ్రామాల్లో కూడా ఫ్రీ గా గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది అని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియా పై వారి ప్రతాపం చూపాలి అని డిమాండ్ చేశారు. డ్రగ్స్, గంజాయి మహమ్మరిని తరిమికొట్టేందుకు జాగృతి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిస్తున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

2nd National Highway | భద్రాద్రి కొత్తగూడెంకు వరం.. రెండో జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?