Santhosh Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు సంతోష్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు. ఎన్నికల సమయంలో ట్యాపింగ్ పాత్రపై కీలక ప్రశ్నలు.

Santhosh Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు సంతోష్ రావు

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సంతోష్ రావును సిట్ బృందం విచారణ సాగిస్తుంది. ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు రెగ్యులర్ గా ఎందుకు సంతోష్ రావు టచ్ లో ఉన్నారు..ట్యాపింగ్ కోసం వారికి సంతోష్ రావు ఇచ్చిన నంబర్లను ఎవరి సూచన మేరకు ఇచ్చారు అన్న అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఉప ఎన్నికలు, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ అధికారులతో సంతోష్ రావు నిత్యం ఎందుకు మాట్లాడారు.. ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్లను సంతోష్ రావు ట్యాపింగ్ కు ఇచ్చారా అన్న అంశాలపై విచారించనున్నారు. గతంలో విచారించిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను అనుసరించి సంతోష్ రావును ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తుంది. కేటీఆర్, హరీష్ రావు విచారణ సందర్బంగా చెప్పిన అంశాలపై కూడా సిట్ అధికారులు సంతోష్ రావును ప్రశ్నించనున్నారు.

ఇవి కూడా చదవండి :

Himachal Pradesh : శునకం విశ్వాసం.. గడ్డకట్టే చలిలోనూ యజమాని మృతదేహానికి 4 రోజులపాటూ కాపలాగా.. కన్నీరు తెప్పిస్తున్న దృశ్యం
Indian Railways : రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం