Pilot Rohith Reddy | పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు
Pilot Rohith Reddy | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. మద్యం, డ్రగ్స్ పార్టీని అడ్డుకునేందుకు వెళ్లగా, వారిపై కాల్పులు జరిపారు.
Pilot Rohith Reddy | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. మద్యం, డ్రగ్స్ పార్టీని అడ్డుకునేందుకు వెళ్లగా, వారిపై కాల్పులు జరిపారు. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు పోలీసులకు దొరికిపోయారు.
చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కథనం ప్రకారం.. మొయినాబాద్ పరిధిలోని అజీజ్ నగర్ ప్రాంతంలోని బీఎంఆర్ ఫామ్ హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఫామ్ హౌస్‌పై ఎస్‌వోటీ, స్థానిక పోలీసులతో కలిసి ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. రాత్రి 9:30 గంటలకు రైడ్ చేశాం. పోలీసులను చూసి తీవ్ర ఆందోళనకు గురైన ఒకరు కాల్పులు జరిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రాగా గుర్తించాం. ఈ తుపాకీ మాత్రం రితేష్ రెడ్డిది. రాజకీయ, వ్యాపార, రియల్ ఎస్టేట్‌కు చెందిన మొత్తం 10 మంది ఈ పార్టీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నమీద్ మిశ్రా, యం.రమేష్, శ్రవణ్‌కుమార్, విజయ్ కృష్ణ, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి, ఓ మహిళ ఉన్నారు.
కాసిక్ రవితో కలిసి మహిళ పార్టీకి వచ్చింది. డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్ర, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది. నిర్ధారణ కోసం రక్త నమూనాలను ఆసుపత్రికి పంపించాం. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా.. వీకెండ్ పార్టీ కోసం కలుసుకున్నారు. 2గ్రాముల వైట్ పౌడర్‌ను సీజ్ చేశాం.. పరీక్షించిన తర్వాత అది డ్రగ్గా కాదా తెలుస్తుంది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్లు వారం కింద సిమ్లా నుంచి వచ్చారు. గోవా నుంచి వచ్చాం.. అక్కడ సేవించినట్లు చెబుతున్నారు. రక్త నమూనాలను పరీక్ష కోసం ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపిస్తాం’’ అని డీసీపీ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram