Samyuktha Menon | టాలీవుడ్‌లో బిజీగా మారిన సంయుక్త మీనన్.. “తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకో” అన్న నెటిజన్‌కు ఫన్నీ రిప్లై!
Samyuktha Menon | మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. కేవలం అందంతోనే కాదు, తన సహజమైన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Samyuktha Menon | మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. కేవలం అందంతోనే కాదు, తన సహజమైన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస విజయాలతో ‘గోల్డెన్ లెగ్’గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాలతో పాటు యువ హీరోల చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంయుక్త తరచుగా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తూ వారి ప్రశ్నలకు స్పందిస్తుంది. తాజాగా ఆమెకు ఓ నెటిజన్ నుంచి ఆసక్తికరమైన రిక్వెస్ట్ వచ్చింది. “హ్యాపీగా తెలుగోడిని పెళ్లి చేసుకో క్యూటీ” అంటూ అతడు ట్వీట్ చేయగా, సంయుక్త దానికి ఫన్నీ ఎమోజీలతో స్పందించింది.
సరదా రిప్లై
అంతటితో ఆగకుండా మరో నెటిజన్ “మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి?” అని సరదాగా అడిగాడు. దానికి సంయుక్త ‘నో’ అన్నట్టు ఒక చిన్న పాప GIF ను కామెంట్ చేస్తూ చమత్కారంగా రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ల వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయాలపై నెటిజన్లు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది నటీమణులు అలాంటి కామెంట్లను పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ సంయుక్త మాత్రం సరదాగా స్పందించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఆమె స్పందన చూసి సంయుక్త నిజంగానే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్‌లో సెటిల్ అవుతుందేమో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
వరుస సినిమాలతో బిజీ..
ఇక సంయుక్త మీనన్ టాలీవుడ్ ప్రయాణం 2022లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుంది. చేసిన సినిమాలు ఎక్కువగా విజయాలు సాధించడంతో ఆమెను ‘లక్కీ హీరోయిన్’ అని కూడా పిలుస్తున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో మరో హిట్ అందుకున్న సంయుక్త చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్నాయి. నిఖిల్‌తో కలిసి నటించిన ‘స్వయంభు’ చిత్రం సమ్మర్‌లో విడుదల కానుంది. అలాగే తమిళంలో ‘బెంజ్’, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. అదనంగా ఆమె స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ది బ్లాక్ గోల్డ్’ అనే ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంయుక్త మీనన్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram