Traffic Restrictions | నేడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‌గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం తెలుగు చలనచిత్రం ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‌గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం తెలుగు చలనచిత్రం ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గాల్లో వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వచ్చే వాహనాలను కృష్ణా నగర్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మీదుగా మళ్లించనున్నారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వైపు వచ్చే వాహనాలను యూసుఫ్‌గూడ బస్తీ వద్ద మళ్లించి ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణా నగర్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్టాప్ వైపు వెళ్లే వాహనాలను సవేరా ఫంక్షన్ హాల్ మీదుగా కృష్ణకాంత్ పార్కు, జీటీఎస్ టెంపుల్, కల్యాణ్ నగర్, మోతీ నగర్ మీదుగా మళ్లించనున్నారు.
- బోరబండ బస్టాప్ నుంచి మైత్రివనం జంక్షన్ వైపు వచ్చే వాహనాలను ప్రైమ్ గార్డెన్ వద్ద మళ్లించి, కల్యాణ్ నగర్ మీదుగా మిడ్‌ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.
పార్కింగ్ పాయింట్లు ఇవే..
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చే అభిమానులు.. తమ వాహనాలను జనకమ్మతోట పార్కింగ్, యూసుఫ్‌గూడలోని మెట్రో పార్కింగ్‌లో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోర్ వీలర్స్‌ను సవేరా ఫంక్షన్ హాల్, మహమ్ముద్ ఫంక్షన్ హాల్‌లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram