KA పాల్‌కు షాక్‌: పార్టీ గుర్తింపు రద్దు.. రాష్ట్రంలో మరో 25 కూడా.. అవేంటంటే

విధాత‌, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా లేని 253 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. అందులో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 25 పార్టీలు రద్దు చేశారు. అందులో అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిండియా ముక్తి దళ్ పార్టీ, ఆలిండియా ముత్తహిదా ఖ్వామీ మహజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, భారత్ అభ్యుదయ పార్టీ, మన పార్టీ, నేషనలిస్టిక్ […]

KA పాల్‌కు షాక్‌: పార్టీ గుర్తింపు రద్దు.. రాష్ట్రంలో మరో 25 కూడా.. అవేంటంటే

విధాత‌, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా లేని 253 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. అందులో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 25 పార్టీలు రద్దు చేశారు. అందులో అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిండియా ముక్తి దళ్ పార్టీ, ఆలిండియా ముత్తహిదా ఖ్వామీ మహజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, భారత్ అభ్యుదయ పార్టీ, మన పార్టీ, నేషనలిస్టిక్ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజా భారత్ పార్టీ, ప్రజాపార్టీ, ప్రజాశాంతి పార్టీ, సురాజ్ పార్టీ ఉన్నాయి.

ఎలక్షన్ కమిషన్ దగ్గర కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిష్టర్ అయ్యాయి. అందులో చాలా పార్టీలు ఇప్పుడు యాక్టివ్‌గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలు పెట్టింది. క్రియాశీలకంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.

అయితే.. మనుగడలోలేని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. తెలంగాణ నుంచి రిజిష్టర్ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని చెప్పిన ఈసీ ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అందులో కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ఈ క్రమంలోనే యాక్టివ్‌గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

2014-19 ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను సైతం యాక్టివ్‌గా లేని పార్టీలుగా గుర్తించారు. కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారనీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈసీ ఆరోపించింది.

ఏదైనా రాజకీయ సంస్థగా నమోదు చేసుకున్న సంస్థకు పోస్టల్ అడ్రస్ తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఈసీకి తెలియజేయాలి. అయితే చాలా రాజకీయ పార్టీలు ఈ విధానాలను పాటించడం లేదని ఈసీ గుర్తించింది. అందుకే ఆయా పార్టీలను రద్దు చేసినట్లుగా ఈసీ ప్రకటించింది.