Mohammed Shami : టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమికి ఎన్నికల సంఘం నోటీసులు

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్‌లో హాజరు కావాలని ఆదేశించింది.

Mohammed Shami : టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమికి ఎన్నికల సంఘం నోటీసులు

ఢిల్లీ: టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అతడితో పాటు సోదరుడు మహ్మద్‌ కైఫ్‌కి కూడా నోటీసులు పంపింది. స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిరిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ఎదుట హాజరు కావాలని ఎన్నికల సంఘం తన నోటీసులో పేర్కొంది.

ఇటీవల న్యూజిలాండ్ తో జరుగనున్న వన్డే సిరీస్ కు ఎంపికకాకపోవడంతో షమీ తీవ్ర నిరాశ చెందాడు. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత అతను సుదీర్ఘ ఫార్మాట్లో ఆడలేదు. చివరి టీ20ని గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌పై ఆడిన షమి.. వన్డేల్లో చివరగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. గాయాలతో జాతీయ జట్టుకు దూరమైన షమి టీమిండియా తలుపు తట్టేందుకు దేశవాళీలో సత్తా చాటినప్పటికి సెలక్షన్‌ కమిటీ అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి :

Bangladesh Bans IPL Telecast : భారత్ పై బంగ్లాదేశ్ ప్రతీకార చర్యలు..ఐపీఎల్ పై నిషేధం
99 Rupees Goat | సంక్రాంతి బంపర్‌ ఆఫర్‌.. 99 రూపాయలకే 12 కిలోల మేకపోతు!