Rashmika-Vijay Marriage | అంతర్జాతీయ స్థాయి భద్రత మధ్య తెలంగాణ కోడలు కానున్న రష్మిక

రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లో జరగనుందన్న వార్తలు దాదాపు ఖరారయ్యాయి. ఇంటర్నేషనల్​ సెక్యూరిటీ, మీడియాకు నో ఎంట్రీ, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్—పూర్తి వివరాలు

Rashmika-Vijay Marriage | అంతర్జాతీయ స్థాయి భద్రత మధ్య తెలంగాణ కోడలు కానున్న రష్మిక

Rashmika Mandanna & Vijay Deverakonda Wedding 2026: International Security, No Media Policy at Udaipur Ceremony

రష్మిక – విజయ్ పెళ్లి 2026

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో గోప్యంగా వివాహం. అంతర్జాతీయ సెక్యూరిటీ, మీడియాకు నో ఎంట్రీ. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే యోచన. టాలీవుడ్‌లో ఇది ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన సెలబ్రిటీ వెడ్డింగ్‌గా మారుతోంది.

 విధాత వినోదం డెస్క్​ | హైదరాబాద్​:

Rashmika-Vijay Marriage | టాలీవుడ్‌లో ప్రస్తుతం అతిపెద్ద హాట్ టాపిక్‌.. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్​లో వీరి వివాహం జరగనున్నట్టు వస్తున్న సమాచారంతో రోజుకో కొత్త అప్‌డేట్ బయటకు వస్తోంది. గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఈ జంట ప్రతి విషయాన్ని రహస్యంగా ప్లాన్ చేస్తుండటంతో అభిమానుల ఆసక్తి ఆకాశానికి చేరింది. ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం, రష్మిక నుదుటిపై శుభ తిలకం కనిపించడం, కంగ్రాట్స్ మెసేజ్‌కు “thank you 😊” అని రిప్లై ఇవ్వడం — ఇవన్నీ పెళ్లి కూతురి సంకేతాలుగా అభిమానులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ భద్రత, పూర్తి గోప్యతతో విజయ్​–రష్మికల వివాహవేడుక

Vijay Deverakonda and Rashmika Mandanna spotted together amid wedding rumours

ఉదయ్‌పూర్‌లోని ఓ హెరిటేజ్ ప్యాలెస్ లేదా లగ్జరీ వేదిక వద్ద వివాహం జరిగే అవకాశముంది. అంచనాల ప్రకారం ఐటీసీ మెమెంటోస్ ఉదయ్‌పూర్(ITC Mementos Udaipur), రాఫెల్స్ ఉదయ్‌పూర్(Raffles Udaipur) లేదా ఫెయిర్‌మాంట్ ఉదయ్‌పూర్ ప్యాలెస్ (Fairmont Udaipur Palace) వంటి ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఒకటి వివాహ వేదికగా ఉండొచ్చని సమాచారం.

ఇక భద్రతా ఏర్పాట్లపై వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కోసం ఏకంగా ఒక అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీనినే నియమించారు. ఆ బృందం స్థానిక రాజస్థాన్ పోలీసులతో కలిసి పని చేసి పూర్తి వ్యక్తిగత గోప్యతను కాపాడనుంది. పెళ్లి ప్రాంగణం చుట్టూ కూడా పటిష్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేస్తారు. ఫోన్లు, కెమెరాలు లోపలికి అనుమతి ఉండదు. ఫోటోగ్రాఫర్లు, వీడియో టీమ్, వెండర్లు అందరూ గోప్యతారక్షణ ఒప్పందాలు(నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్– Non-Disclosure Agreement) సంతకం చేసినట్టు సమాచారం.

కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించలేదని, మీడియాకు ప్రవేశంపై పూర్తిగా నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ఎలాంటి లీకులు లేకుండా, పూర్తిగా సన్నిహిత వేడుకగా జరగాలన్నదే కాబోయే భార్యాభర్తలఉద్దేశమని చెబుతున్నారు.

మూడు రోజుల ఉత్సవాలు – హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

Rashmika Mandanna in traditional attire with a sacred tilak on her forehead

వేడుకలు ఫిబ్రవరి 24 నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 24న హల్దీ లేదా ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలు, 25న సంగీత్, 26న వివాహం జరిగేలా నిర్ణయించినట్లు ప్రచారం. అన్నీ అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు చాలా కొద్దిమందికే తెలుసట.

పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్​లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. బహుశా తాజ్ కృష్ణ వంటి ప్రీమియం వేదిక వద్ద ఈ ఈవెంట్ జరగొచ్చని అంచనా. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ ప్రముఖులు, స్నేహితులు, బంధువులు హాజరవుతారు. రిసెప్షన్‌లో కూడా మీడియాకు అనుమతి ఉండదని సమాచారం.

పెళ్లి పూర్తైన కొన్ని రోజుల తర్వాతే జంట మీడియాను కలవవచ్చని, అధికారిక ఫోటోలు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. విజయ్ ఇంటి వద్ద పందిరి, లైటింగ్​ ఏర్పాట్లు కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

ఈ జంట ప్రేమకథ – అభిమానుల ఉత్సుకత

Vijay Deverakonda and Rashmika Mandanna in Geetha Govindam movie still where their on-screen love story began

రష్మిక – విజయ్ జంట మొదటగా గీతా గోవిందం(Geetha Govindam 2018)లో కలిసి నటించి భారీ విజయం అందుకున్నారు. తర్వాత డియర్ కామ్రేడ్(Dear Comrade 2019)తో మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అప్పటి నుంచి వీరి అనుబంధంపై పుకార్లు ఎప్పుడూ షికార్లు చేస్తూనేఉన్నాయి.

2025 అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగిందన్న వార్తలూ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు పెళ్లి సమయం దగ్గరపడుతున్నట్టు సంకేతాలు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. వీరి కలయికలో మూడో సినిమాగా రాహుల్​ సంకృత్యాన్​ దర్శకుడిగా ‘రణబాలి’ కూడా రాబోతోంది.

ఈ పరిస్థితుల్లో ఇక ఎవరూ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడటంలేదు. పెళ్లి నిజమనే విషయం ఎప్పుడో బయటపడింది. ఇప్పుడు వివాహాన్ని కుటుంబ అంతర్గత వేడుకగా  చూసుకోవడమే ప్రధానంగా కనిపిస్తోంది.  ఈ వివాహం 2026లో టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన సెలబ్రిటీ వెడ్డింగ్‌గా నిలువబోతోంది. అభిమానులు మాత్రం ఈ జంటకు హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.