Kethireddy Peddareddy| తాడిపత్రిలో మరోసారి హైడ్రామా..పెద్దారెడ్డికి పోలీసుల షాక్

అమరావతి : సుప్రీంకోర్టు9(Supreme Court)ఆదేశాలతో పోలీసు భద్రత మధ్య 15నెలల తర్వాత శనివారం తన సొంత నియోజకవర్గం తాడిపత్రి(Tadipatri)లోని ఇంటికి చేరుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Peddareddy)కి పోలీసులు 24గంటలు గడువక ముందే షాక్ ఇచ్చారు. ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు సభ(Chandrababu Meeting)ఉండడంతో పెద్దారెడ్డిని వెంటనే తాడిపత్రి విడిచి వెళ్ళాలని పోలీసులు ఆదేశించారు(Police Orders). అలాగైతే దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని పోలీసులను పెద్దారెడ్డి కోరారు. లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తూ..చంద్రబాబు సభకు పోలీసు బలగాలను తరలించాల్సి ఉన్నందునా పెద్దారెడ్డి భద్రతకు కేటాయించిన సిబ్బందిని అక్కడికి తరలించాల్సి ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో వెంటనే పెద్దారెడ్డిని తాడిపత్రి విడిచి వెళ్లాలని అనంతపురం ఎస్పీ జగదీష్ ఆదేశించారు. దీంతో సీఎం చంద్రబాబు సభ అనంతరం తిరిగి తాడిపత్రి వస్తానని పెద్దారెడ్డి ఎస్పీ కి మెయిల్ పంపించిన పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల సూచనలతో తాడిపత్రి నుంచి తన స్వగ్రామం తిమ్మంపల్లికి కేతిరెడ్డి వెళ్లిపోయారు. 24 గంటలకే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం చర్చనీయాంశమైంది.