జాబ్ క్యాలెండర్‌ గురించి ఆలోచించండి : ఏపీ పోరాట ఉద్యోగ సమితి

విధాత,విజయవాడ: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెంటర్ అని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ రిలీజ్ చేశారని మండిపడ్డారు.ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 10వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తారా అంటూ ఆందోళనకు దిగారు. ఈ నెల 18వ తేదీ లోపు స్పష్టమైన ప్రకటన రాకుంటే సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని ఏపీ ఉద్యోగ పోరాట […]

జాబ్ క్యాలెండర్‌ గురించి ఆలోచించండి : ఏపీ పోరాట ఉద్యోగ సమితి

విధాత,విజయవాడ: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెంటర్ అని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ రిలీజ్ చేశారని మండిపడ్డారు.ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 10వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తారా అంటూ ఆందోళనకు దిగారు. ఈ నెల 18వ తేదీ లోపు స్పష్టమైన ప్రకటన రాకుంటే సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని ఏపీ ఉద్యోగ పోరాట సమితి వెల్లడించింది.

ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అక్రమ కేసులు పెడతారా..అంటూ ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, ఇచ్చిన హామీలు అమలు చేయమంటే జగన్ సర్కార్ ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వయసు పరిమితి దాటిపోవడంతో ఉద్యోగాలకు అనర్హులుగా మారే అవకాశం ఉందని, జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ పోరాట ఉద్యోగ సమితి సూచించింది.