DJ Sound : డీజే సౌండ్ కారణంగా మరో యువకుడు బలి!

విజయనగరం వినాయక నిమజ్జనంలో డీజే శబ్ధాలకు యువకుడు హరిష్ (22) కుప్పకూలి మృతి చెందాడు. వైద్యులు డీజేలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు.

DJ Sound : డీజే సౌండ్ కారణంగా మరో యువకుడు బలి!

అమరావతి : భారీ డీజే శబ్ధాలు గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్న వినకుండా యువత పెళ్లిళ్లు.. ఊరేగింపులు, శోభాయాత్రలలో డీజేలు పెట్టి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జనంలో డాన్స్ చేస్తూ డీజే సౌండ్ కు హరిష్ (22) కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ ఘటనతో అప్పటిదాక కోలహలంగా సంబరాలతో సాగిపోతున్న వినాయక ఊరేగింపు కాస్తా విషాదంగా మారింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనోత్సవాలు సాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా డీజేలకు..ముఖ్యంగా భారీ శబ్ధాలతో కూడిన డీజేలకు దూరంగా ఉండాలని వైద్యలు సూచిస్తున్నారు. గత ఏప్రిల్ లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గూడాల గ్రామం సాకావారిపేటలో అంబేడ్కర్‌ జయంతి ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే బాక్సుల ముందు డ్యాన్సులు చేసిన జల్లి రాజేష్‌(25) అనే యువకుడు డీజే కార్డియాక్‌ అరెస్ట్‌తో మృత్యువాత పడ్డాడు. ఇదే కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా ముగింపు వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ డీజే సౌండ్ బాక్సుల శబ్దానికి ఓ యువకుడి(21) ప్రాణం పోయింది.