Vontimitta Sita Rama Kalyanam | ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Vontimitta Sita Rama Kalyanam | ఏపీలోని ఒంటిమిట్టలో బుధవారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ
తలంబ్రాలు ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం సిద్ధం

Vontimitta Sita Rama Kalyanam | విధాత, హైదరాబాద్: ఏపీలోని ఒంటిమిట్టలో బుధవారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీ సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా ఏప్రిల్ 1న సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.

కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల‌ మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు సకాలంలో సేవలు అందెలా పారా మెడికల్ సిబ్బంది, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 28 కియోస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణం, అన్నప్రసాదాలు అందచేస్తారు. నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసి ఇందులో పాన‌కం, మ‌జ్జిగ‌, చ‌లివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ని అందుబాటులో పెట్టారు.

శ్రీ కోదండ‌రామ‌స్వామి వారి ఆల‌యం నుండి క‌ల్యాణ వేదిక వ‌ర‌కు భ‌క్తులు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో న‌డిచేందుకు వీలుగా చలువ పందిళ్లు, నీటి పిచుకారి యంత్రాలు అమర్చారు. ఆల‌య స‌మీపంలో 3 వేల మంది భ‌క్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్ల‌లో వెళ్ళెందుకు జ‌ర్మ‌న్ షెడ్డు ఏర్పాటు చేశారు.

శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్ లు బిగించారు. టిటిడి విజిలెన్స్ విభాగం, అబ్జర్వేషన్ టీం, ఫైర్ సిబ్బంది 510 మంది, టిటిడి స్కౌట్స్ 200 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మంది సేవలు నిరంతరం అందిస్తారు. అదేవిధంగా 235 సిసి కెమెరాలు, 12 డ్రోన్ లు, కామాన్ కమెండ్ కంట్రోల్ సెంటర్, మరో మూడు స‌బ్ కంట్రోల్ రూమ్ ల నుండి పర్యవేక్షణ ఉంటుంది.

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో, క‌ల్యాణ వేదిక వ‌ద్ద నిరంతరాయంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కల్పించారు. రుచిక‌ర‌మైన అన్నం, సాంబ‌రు, ర‌సం, మ‌జ్జిగ‌, ప‌చ్చ‌డి, క‌ర్రీ, బెల్లం పొంగ‌లి అందిస్తారు. కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేశారు.

13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు వీక్షించేందుకు వీలుగా హెచ్‌డి క్యాలిటీతో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనున్నారు.

Read More:

AP Aarogyasri Services | ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవల బంద్

Akiya Houses | జపాన్‌లో ఫ్రీగా ఇల్లు.. అయినా ఎవరూ రావట్లేదు.. దీని వెనుక మిస్టరీ ఏంటి?

Latest News