• Telugu News
  • /Trending

Akiya Houses | జపాన్‌లో ఫ్రీగా ఇల్లు.. అయినా ఎవరూ రావట్లేదు.. దీని వెనుక మిస్టరీ ఏంటి?

Akiya Houses | జపాన్‌లోని గ్రామాల్లో జనాలు వదిలేసి వెళ్లడంతో ఖాళీగా మారిన 90 లక్షలకు పైగా ఇళ్ల (అకాయి)ను ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫర్ విదేశీయులను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నప్పటికీ.. వాటిలో ఉండేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. దీని వెనుక మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Reported by: Chandram | ట్రెండింగ్ | Mar 31, 2026, 10:10 pm IST
Read Time: 6 mins
Akiya Houses | జపాన్‌లో ఫ్రీగా ఇల్లు.. అయినా ఎవరూ రావట్లేదు.. దీని వెనుక మిస్టరీ ఏంటి?

Akiya Houses | రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో సొంతింటి కల నెరవేరడం గగనమైపోయింది. కానీ ఇలాంటి తరుణంలో జపాన్‌లో మాత్రం ఉచితంగా ఇళ్లను అందిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అక్కడ ఖాళీగా ఉన్న ఇళ్లను వాడుకలోకి తీసుకొచ్చేందుకు అక్కడి సంస్థలు చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

జపాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ ఇళ్లను జపాన్ ప్రభుత్వం అకియాగా పిలుస్తుంది. జనాభా తగ్గుదల, వృద్ధాప్యం పెరగడం, యువకులు గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరగడం వంటి కారణాలతో చాలా ఇల్లు ఖాళీ అయ్యాయి. మొత్తం నివాస గృహాల్లో దాదాపు 13.8 శాతం ఖాళీగా ఉన్నాయి. వచ్చే దశాబ్దంలో దాదాపు 1.1 కోట్లకు చేరే అవకాశం ఉందని నోమురా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేస్తోంది.

జపాన్‌లో ఎక్కువ శాతం యువకులు గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్లిపోయారు. దీంతో చాలామంది వృద్ధులు ఒంటరిగానే గ్రామాల్లోనే మిగిలిపోయారు. అలాంటి వృద్ధులు ఒంటరిగా ఉండి.. అవే ఇళ్లలో మరణిస్తున్నారు. ఇలా ఒంటరి మరణాలు (Lonely Deaths) సంభవించిన ఇళ్లను అరిష్టంగా భావిస్తున్నారు. వాటిని ఇళ్లను శపించబడిన ఇల్లు (Cursed Houses) అని అంటుంటారు. అలాంటి ఇళ్లలో నివసించడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. దీంతో అందులో ఉండటానికి, కొనడానికి ఎవరూ రాకపోవడంతో ఇంటి యజమానులు కూడా అలాగే ఖాళీ వదిలేస్తున్నారు. అలా చాలామంది ఇళ్లను వదిలేసి వెళ్లడంతో జనాలు లేక గ్రామాలు దెయ్యాల గ్రామాలు(Ghost Villages)గా మారిపోయాయి.

అకియా ఇండ్లతో నిర్మానుష్యంగా మారిన గ్రామాలకు మళ్లీ పునరుజ్జీవం కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఇళ్ల పరిరక్షణకు అకియా బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆసక్తి కలిగిన వారికి చాలా తక్కువ ధరలకే ఇళ్లను అందిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఉచితంగా అందించే కూడా ఇళ్లను అందిస్తున్నారు. ఫ్రీగా ఇళ్లను అందిస్తున్నామని ఆఫర్లు ఇవ్వడంతో.. ఇది విదేశీయులను సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఫ్రీ వెనుక ఉన్న లొసుగు

ఉచితంగా ఇళ్లను ఇస్తున్నారనేసరికి వీటికోసం చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ ఆఫర్ల వెనుక వాస్తవం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి పలు కారణాలను వివరిస్తున్నారు.ఉచితంగా, తక్కువ ధరకే అందిస్తున్న ఈ ఇల్లు చాలావరకు శిథిలావస్థకు చేరుకుని ఉండటంతో మరమ్మతులకే చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో ఆ ఖర్చు ఇంటి విలువను మించిపోతున్నాయి. పైగా భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, జపనీస్ భాష రాకపోవడం వంటి ప్రతికూలతల మధ్య ఇంటిని తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అందుకే ఫ్రీ ఆఫర్లకు ఆకర్షితులై, తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అక్కడి చట్టాలు, ఖర్చులు ప్రమానాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Read More:

Belly Man | సిక్స్ ప్యాక్ కాదు.. బొర్ర ఉంటేనే సుందరాంగులు.. అక్కడ పొట్ట ఉన్న అబ్బాయిల వెంటే అమ్మాయిలు క్యూ కట్టేస్తారు!

Vermicompost Business | వ‌ర్మీకంపోస్టు త‌యారీ.. రూ. 20 వేల పెట్టుబ‌డితో ఏడాదికి రూ. 2 కోట్ల ట‌ర్నోవ‌ర్