ఇతర రాష్ట్రంలోని అమూల్ పై ఉన్న శ్రద్ధ మన రాష్ట్రంలోని డైయిరీలపై ఎందుకు లేదు?
విధాత:రాష్ట్రంలోని పాల డెయిరీలను ఒక వైపు నిర్వీర్యం చేస్తూ మరో వైపు పాల రైతులను ఆదుకుంటున్నామని జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్యపదంగా ఉంది. నిజంగా పాడి రైతులకు మేలు చేయాలనుకుంటే రాష్ట్రంలోని 13 సహకార, 7 ప్రైవేటు డెయిరీలు ఉండగా… ఇవేవీ కాదని గుజరాత్‌కు చెందిన సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? ఇక్కడ ఉత్పత్తయ్యే పాలల్లో అధికశాతం అమూల్ కు ధారాదత్తం చేయడానికి కుట్ర పన్నడం దుర్మార్గం. లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన […]

విధాత:రాష్ట్రంలోని పాల డెయిరీలను ఒక వైపు నిర్వీర్యం చేస్తూ మరో వైపు పాల రైతులను ఆదుకుంటున్నామని జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్యపదంగా ఉంది. నిజంగా పాడి రైతులకు మేలు చేయాలనుకుంటే రాష్ట్రంలోని 13 సహకార, 7 ప్రైవేటు డెయిరీలు ఉండగా… ఇవేవీ కాదని గుజరాత్‌కు చెందిన సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? ఇక్కడ ఉత్పత్తయ్యే పాలల్లో అధికశాతం అమూల్ కు ధారాదత్తం చేయడానికి కుట్ర పన్నడం దుర్మార్గం.
లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చక పోవడంతో దాదాపు రూ. 700 కోట్లు పాడిరైతులు నష్టపోయారు.అమూల్ సంస్థపై జగన్ కు ఎందుకంత ప్రేమ? తన ఈడీ కేసుల మాఫీ కోసం ఇక్కడి సంపదను గుజరాత్ కు తరలిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో పాలు పోయాలన్న షరతు విధించే దిశగా పాడి రైతులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అమూల్ కు పాల సేకరణకు రాష్ట్రంలో సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోలేదు. అమూల్ కోసం రూ.6,551 కోట్లు జగన్ రెడ్డే ఎందుకు ఖర్చు పెడుతున్నారు? నేరుగా ప్రభుత్వ అధికారులే రంగంలోకి దిగి అమూల్‌కు కాకుండా ఇతర డైయిరీలకు పాలు పోస్తే ప్రభుత్వ పథకాలు రద్దు అవుతాయని పాల ఉత్పత్తిదారులకు హెచ్చరికలు జారీచేశారు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్
మాజీ మంత్రి వర్యులు