YS Sunitha | పులివెందులలో సింగిల్ ప్లేయర్‌గా ఉండేందుకే హత్య

పులివెందులలో సింగిల్‌ప్లేయర్‌గా ఉండేందుకే వివేకాను హత్య చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి పై దివంగత వైఎస్‌. వివేకానంద రెడ్డి కూతురు సునీత తీవ్ర ఆరోపణలు చేశారు

YS Sunitha | పులివెందులలో సింగిల్ ప్లేయర్‌గా ఉండేందుకే హత్య

వైఎస్ భారతిపై సునీత ఆరోపణలు

విధాత : పులివెందులలో సింగిల్‌ప్లేయర్‌గా ఉండేందుకే వివేకాను హత్య చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి పై దివంగత వైఎస్‌. వివేకానంద రెడ్డి కూతురు సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల్లోనూ సింగిల్‌ ప్లేయర్‌గా అవినాష్‌రెడ్డి ఒక్కరే ఉండాలంటే భారతి నన్ను, షర్మిలను కూడా నరికేస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకాను అదేవిధంగా చంపివేశారని ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని సీబీఐ, పోలీసులకు కూడా తెలుసన్నారు.

కాగా.. తమ కుటుంబానికి భద్రత లేనందున రక్షణ పెంచుకోవాలని స్థానిక పోలీసులు కూడా సూచిస్తున్నారని తెలిపారు. వివేకా హత్య కేసు తేల్చేందుకుగాను అన్నింటికి తెగించి ముందుకు వచ్చానని, ప్రాణహాని ఉన్నందున ముందు జాగ్రత్తగా విలునామను నా పిల్లలకు రాసిస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్‌ అవినాష్‌కు జగన్‌ను ఎదురించి మాట్లాడే సత్తా ఉందన్నారు. మరోవైపు కడప ఎంపీ అభ్యర్థి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌.షర్మిల సైతం చెల్లెలు కంటే భారతి, ఆమె బంధువులే నీకు ఎక్కువయ్యారా అంటూ ప్రశ్నించారు. షర్మిల, సునీతలు ఇద్దరు వైఎస్ భారతి టార్గెట్‌గా విమర్శలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.