Beauty tips : స్ట్రెచ్ మార్క్స్..! చర్మం సాధారణ స్థాయికి మించి సాగడం వల్ల పొట్టపై చారలు ఏర్పడుతాయి. ఈ చారలనే స్ట్రెచ్ మార్క్స్ అంటారు. మహిళలను ముఖ్యంగా అందం కోసం తపించే మహిళలను ఈ స్ట్రెచ్ మార్క్స్ తెగ ఇబ్బందిపెడుతాయి. సాధారణంగా గర్బధారణ సమయంలో మహిళల పొట్టపై ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. వేగంగా లావు పెరిగిన పురుషుల్లోనూ ఈ స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. కానీ పురుషుల స్ట్రెచ్ మార్క్స్ షర్ట్ లోపల పోతాయి. ఇబ్బంది ఉండదు. కానీ ఆడవాళ్ల చీరకట్టువల్ల ఇవి బయటికి కనిపిస్తాయి. కాబట్టి ఇబ్బంది పడుతారు. మరి ఈ చారలు పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
గర్బధారణ సమయంలో కడుపులో బిడ్డ పెరిగినాకొద్ది పొట్ట సాగుతుంది. దాంతో పొట్ట మీది చర్మం సాగి చారలు ఏర్పడుతాయి. ప్రసవం తర్వాత పొట్టభాగం యథాస్థితికి వచ్చినా ఈ చారలు పోవు. కాకపోతే కొద్దిగా సన్నబడుతాయి. ఈ చారల సమస్య మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. వాటిని పోగొట్టుకోవడానికి వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ప్రయోజనం లేక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి వంటింట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. ఎంతో మంది మహిళలు ఈ వంటింటి చిట్కాలు పాటించి సక్సెస్ అయ్యారట. వాటిలో బాగా సక్సెస్ రేటు ఉన్న రెండు వంటింటి చిట్కాలు చూద్దాం..
మొదటి చిట్కా : స్నానం చేయడానికి గంట ముందు ఆముదం నూనెను గోరువెచ్చగా చేసుకుని చారలు ఉన్నచోట తైలమర్దన చేయాలి. ఆ తర్వాత గంట సేపటికి స్నానం చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ పోతే నాలుగు వారాల్లో తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
రెండో చిట్కా : ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు బాదాం నూనెతో చారలపై మర్దన చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే వేడి నీటితో స్నానం చేసి, చారలపై కలబంద గుజ్జు రాసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తూపోతే నాలుగైదు వారాల్లోనే మంచి ఫలితం ఉంటుందట.