డ్యాన్స్ చేస్తుండ‌గా.. గుండెపోటుకు గురైన 15 ఏండ్ల బాలుడు.. వీడియో

అది పెళ్లి వేడుక‌. నూత‌న వ‌ధూవ‌రుల ముందు పిల్ల‌లంతా డీజే పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత‌మంతా హుషారుగా ఉంది. అయితే డ్యాన్స్ చేస్తున్న వారిలో ఓ పిల్లాడు ఉన్న‌ట్టుండి.. కుప్ప‌కూలిపోయాడు.

డ్యాన్స్ చేస్తుండ‌గా.. గుండెపోటుకు గురైన 15 ఏండ్ల బాలుడు.. వీడియో

ల‌క్నో : అది పెళ్లి వేడుక‌. నూత‌న వ‌ధూవ‌రుల ముందు పిల్ల‌లంతా డీజే పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత‌మంతా హుషారుగా ఉంది. అయితే డ్యాన్స్ చేస్తున్న వారిలో ఓ పిల్లాడు ఉన్న‌ట్టుండి.. కుప్ప‌కూలిపోయాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన మిగ‌తా వారు అత‌న్ని పైకి లేప‌గా స్పందించ‌లేదు. ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎట‌వాలో చోటు చేసుకుంది.

గుండెపోటుకు గురైన బాలుడిని పెళ్లి కుమారుడి చిన్న త‌మ్ముడిగా పోలీసులు నిర్ధారించారు. త‌న త‌మ్ముడు సుధీర్‌ గుండెపోటుతో చ‌నిపోవడంతో పెళ్లి కుమారుడు క‌న్నీరు పెట్టుకున్నాడు. త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. సుధీర్ కుప్ప‌కూలిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

గుండెపోటుతో జ‌ర్న‌లిస్టు మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఏఎన్ఐ రిపోర్ట‌ర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న గురువారం చోటు చేసుకుంది. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉండ‌గానే రిపోర్ట‌ర్ ర‌వి గుప్తా చ‌నిపోయిన‌ట్లు తెలిసింది. చాలా ఏండ్లుగా ఏఎన్ఐ సంస్థ‌లో రిపోర్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు ర‌వి గుప్తా.