ఇంట్లో ఉన్న సోఫా, ఫోటో ఫ్రేమ్స్‌ను ఆరగిస్తోన్న మూడేండ్ల బాలిక..!
సాధారణంగా చిన్న పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇంట్లో ఉన్న సోఫా, ఫోటో ఫ్రేమ్స్, స్పాంజి, గ్లాస్ మెటిరీయల్స్‌ను తింటూ గడిపేస్తోంది.

సాధారణంగా చిన్న పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇంట్లో ఉన్న సోఫా, ఫోటో ఫ్రేమ్స్, స్పాంజి, గ్లాస్ మెటిరీయల్స్‌ను తింటూ గడిపేస్తోంది. ఇలా అసాధారణ వస్తువులను ఆరగిస్తున్న ఈ మూడేండ్ల బాలిక గురించి తెలుసుకోవాలంటే లండన్‌కు వెళ్లాల్సిందే.
లండన్‌కు చెందిన స్టాస్సీ(25) కి వింటర్ అనే మూడేండ్ల కుమార్తె ఉంది. వింటర్ ఇంట్లో వండిన ఆహారాన్ని అసలు ఇష్టపడదు. చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్‌ను కూడా తినేందుకు ఆసక్తి చూపదు. ఆ పాప కేవలం తన బెడ్‌లో ఉన్న దూది, సోఫా కట్టెలు, ఫోటో ఫ్రేమ్స్, దానికి ఉండే గాజు గ్లాసులను ఆరగించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో తల్లి స్టాస్సీ వింటర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆ వస్తువులను తినకుండా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో రాత్రి సమయాల్లో లేచి, దూదిని తింటున్నట్టు తల్లి తెలిపింది.
ఆటిజంతో బాధపడుతున్న ఆ చిన్నారిలో ఈ అలవాట్లు చిన్నప్పట్నుంచే వచ్చినట్లు వెల్లడైంది. మొత్తానికి ఆ బేబి ఇంటిని మొత్తాన్ని తినేసినట్లు తల్లి వాపోయింది. ఇప్పటి వరకు ఎనిమిది ఫోటో ఫ్రేములను తినడానికి ప్రయత్నించినట్లు పేర్కొంది. కొవ్వొత్తి మైనాన్ని తింటూ పట్టుబడింది. ఆటబొమ్మల్లోని దూదిని కూడా చాలాసార్లు ఆమె మింగేసింది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారిని వైద్య పరిభాషలో పికాగా పరిగణిస్తారు. ఆటిజంతో బాధపడే చిన్నారుల్లో పికా అనేది సాధారణ సమస్య. వింటర్ ఎక్కువగా మాట్లాడదు. ఆమె ప్రవర్తనలో చాలా మార్పులు ఉన్నాయని తల్లి పేర్కొంది.