పారాసిటమాల్ తో ఆటిజమ్..!?

గర్భధారణ సమయంలో తలనొప్పి, జ్వరం, శరీర నొప్పులు తరచుగా వస్తాయి. ఈ సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగించే మందు పారాసిటమాల్ దీని వాడకంపై కొత్త సందేహాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా శిశువు మెదడు అభివృద్ధి (న్యూరో డెవలప్ మెంట్) పై దీని ప్రభావం గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

  • By: Tech    health    Sep 24, 2025 11:30 AM IST
పారాసిటమాల్ తో ఆటిజమ్..!?

గర్భధారణ సమయంలో తలనొప్పి, జ్వరం, శరీర నొప్పులు తరచుగా వస్తాయి. ఈ సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగించే మందు పారాసిటమాల్ (అసెటామినోఫెన్). వైద్యులు సాధారణంగా “సేఫ్ డ్రగ్” కేటగిరీలో ఈ మందును ఉంచినా, ఇటీవల వెలువడిన పరిశోధనలు దీని వాడకంపై కొత్త సందేహాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా శిశువు మెదడు అభివృద్ధి (న్యూరో డెవలప్ మెంట్) పై దీని ప్రభావం గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఆటిజం ప్రమాదం?

కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు గర్భిణులు తరచుగా పారసిటమాల్ వాడితే, పుట్టే పిల్లల్లో ఆటిజం (ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్), ఎడిహెచ్ డి (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. అయితే ఇవి కేవలం న్యూరోడెవలప్ మెంట్ తో సంబంధాన్ని మాత్రమే చూపిస్తున్నాయి. “అసెటామినోఫెన్ వాడకమే నేరుగా కారణం” అని నిర్ధారించడానికి ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవు.
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ ఔషధం
• ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచవచ్చు,
• హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినవచ్చు.
• ఎపిజెనెటిక్స్ (జన్యు స్థాయిలో మార్పులు) ద్వారా శిశువు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు.
ఈ ప్రభావాలు పారాసిటమాల్ ని ఎక్కువ తరచుగా లేదా దీర్ఘకాలంగా వాడినప్పుడు కనిపించే అవకాశముందని చెబుతున్నారు.
మరి ఏం చేయాలి?
• గర్భిణులు డాక్టర్ సలహా లేకుండా ఏ మందూ వాడకూడదు.
• అవసరమైతేనే, తక్కువ మోతాదులో, తక్కువ కాలం మాత్రమే వాడాలి.
• గర్భిణులు తమ మందుల వాడకాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. చిన్న చిన్న నొప్పులకే మందులు వాడకూడదు.
ఇప్పటికీ సమాధానం లేని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అసెటామినోఫెన్ నిజంగా ఆటిజం లేదా ఎడిహెచ్ డి కి నేరుగా కారణవుతుందా? దీర్ఘకాల వాడకం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సురక్షిత మోతాదు ఏమిటి?… ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సిందే.