రైలు పట్టాలపై పడిపోయిన బస్సు.. నలుగురు మృతి
జైపూర్ : రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ఓవర్ బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రైలు పట్టాలపై పడిపోయింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2:15 గంటలకు చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 28 మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నలుగురు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు హరిద్వార్ నుంచి ఉదయ్‌పూర్ వెళ్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram