• Telugu News
  • /National

Budget effect on stock market| బడ్జెట్ ఎఫెక్ట్ …కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కేంద్ర వార్షిక బడ్డెట్ 2026-27 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో లో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. బడ్జెట్ ప్రభావంతో మధ్యాహ్నం కల్లా సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా నష్టాలు చవి చూసింది. నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టాల్లో పడిపోయింది

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Feb 01, 2026, 12:48 pm IST
Read Time: 2 mins
Budget effect on stock market| బడ్జెట్ ఎఫెక్ట్ …కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ : కేంద్ర వార్షిక బడ్డెట్ 2026-27 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో లో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. బడ్జెట్ ప్రభావంతో మధ్యాహ్నం కల్లా సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా నష్టాలు చవి చూసింది. నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టాల్లో పడిపోయింది. ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై ఎస్‌టీటీని పెంచడంతో నష్టాల్లోకి వెళ్లాయి. బడ్జెట్‌లో కంపెనీల బైబ్యాక్‌పై పన్ను విధించడంతో పాటు కమోడిటీ ఫ్యూచర్స్‌లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను పెంచడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

బడ్జెట్ పూర్తి వివరాలు వెల్లడయ్యాక స్టాక్ మార్కెట్ పై వాటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 12.30నిమిషాల కల్లా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం పూర్తి చేశారు.