TSPSC: AEE నియామ‌క ప‌రీక్ష‌ల తేదీలు ఖ‌రారు.. ఎప్పుడంటే..?

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ కార‌ణంగా.. ఏఈఈ(AEE) పోస్టుల‌కు నిర్వ‌హించిన రాత ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించి రాత ప‌రీక్ష‌ల తేదీల‌ను టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. మే 8వ తేదీన ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ పోస్టుల‌కు, 9న అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మే 21న సివిల్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో, సివిల్ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు […]

TSPSC: AEE నియామ‌క ప‌రీక్ష‌ల తేదీలు ఖ‌రారు.. ఎప్పుడంటే..?

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ కార‌ణంగా.. ఏఈఈ(AEE) పోస్టుల‌కు నిర్వ‌హించిన రాత ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించి రాత ప‌రీక్ష‌ల తేదీల‌ను టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది.

మే 8వ తేదీన ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ పోస్టుల‌కు, 9న అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మే 21న సివిల్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో, సివిల్ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది.

గ్రూప్-1 జూన్ 11న నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ర‌ద్దు అయిన డీఏవో, ఏఈ, టీపీబీవో, అసిస్టెంట్ వెట‌ర్న‌రీ పోస్టుల‌కు సంబంధించిన ప‌రీక్ష‌ల తేదీలు ఖ‌రారు కావాల్సి ఉంది.