Gold stable, Silver falls| స్థిరంగా బంగారం..మరింత తగ్గిన వెండి

బంగారం, వెండి ధరల అస్థిరత కొనసాగుతుంది. బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,54,200వద్ద నిలిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Feb 18, 2026, 12:54 pm IST
Read Time: 2 mins
Gold stable, Silver falls| స్థిరంగా బంగారం..మరింత తగ్గిన వెండి

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరల అస్థిరత కొనసాగుతుంది. బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,54,200వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,41,350 వద్ద కొనసాగుతుంది. ఓ దశలో రూ. 1, 80 వేల రూపాయలు దాటిన బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పడిపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులలో స్థిరత్వం.. డాలర్ విలువ బలపడటం కూడా బంగారం ధరల పతనానికి కారమవుతోంది. ఫిబ్రవరి నెలలో బంగారం ధరలలో 9శాతం తగ్గుదల నమోదైంది. భారత్ లో శుభ మూహుర్తాల సందడి మొదలు కావడంతో బంగారం, వెండి కొనుగోలు ప్రస్తుతం ధరల వద్ద పెరిగే అవకాశం కనిపిస్తుంది.

రూ.5వేలు తగ్గిన వెండి

వెండి ధరలు మరింత పతనమయ్యయి. బుధవారం కిలో వెండి ధర రూ. 5000తగ్గి.. రూ. 2,60,000 వద్ద కొనసాగుతుంది. ఫిబ్రవరి నెలలో ఇప్పటిదాక వెండి ధరలలో 19శాతం తగ్గుదల నమోదైంది. వెండి ఆల్ టైమ్ రికార్డు ధర రూ. 4,20,000 నుంచ రూ. 2,60,000కు పడిపోయింది. తాత్కాలికంగా ధరలు తగ్గినా, భవిష్యత్తులో వెండి, బంగారం ధరలు మళ్లీ పుంజుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.