రసవత్తరంగా సాగుతున్న టికెట్ టూ ఫినాలే టాస్క్.. బేరాలు మొదలుపెట్టిన అమర్‌దీప్

బిగ్‌బాస్ సీజన్ 7 తుది అంకానికి చేరుకుందనే చెప్పాలి. ఫినాలీకి ఇంకా రెండు వారలు మాత్రమే ఉండడంతో బిగ్ బాస్ కాస్త టఫ్ టాస్క్‌లు ఇస్తూ హౌజ్‌మేట్స్ కి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు..మంగళవారం ఎపిసోడ్ మొత్తం టికెట్ టు ఫినాలే టాస్క్ లతో సాగిపోగా, ఈ టాస్క్ ల్లో మొత్తం మూడు గేమ్స్ ని పెట్టారు. మొదటి గేమ్ ‘వీల్ ఛాలెంజ్’, సెకండ్ గేమ్ ‘ఫ్లవర్ ఛాలెంజ్’, థర్డ్ గేమ్ ‘బాల్ టాస్క్’. మొదటి టాస్క్‌లో అందరు ఎలిమినేట్ అయిపోగా, చివరికి అర్జున్ విజేతగా నిలిచారు. తరువాత ఫ్లవర్ టాస్క్‌లో.. శివాజీ, ప్రియాంక తక్కువ పూలను సేకరించి ఎలిమినేట్ అయ్యారు.
రెండు టాస్క్‌లలో తక్కువ మార్కులు వచ్చిన శివాజీ, శోభాశెట్టి ని టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పుకోమని.. వారి సంపాదించిన మార్కులను మరొకరికి ఇవ్వాలంటూ చెప్పడంతో వారిద్దరు అమర్‌కి ఇచ్చారు. ఈ క్రమంలో అమర్ ముందు వరుసలో ఉండగా, ఇంకెవరైనా ఆప్లేస్ ను కొట్టేస్తారేమో అన్న భయం అమర్ లో ఉంది. అందుకే శివాజీని పక్కకుపిలిచి మీచేతుల్లోనే ఉంది అని ఏదో బేరసారాలు ఆడుతున్నాడు. అయితే తన చేతుల్లో ఏమీ లేదని.. ఏదైనా ఉంటే.. వారితో మాట్లాడుకోమన్నాడు శివాజీ. ఇక తాజా ఎపిసోడ్‌లో నామినేషన్స్, టాస్క్‌ల గురించి మాట్లాడుకుంటుండగా, బిగ్ బాస్ అందరు బద్దకంతో ఉన్నారని గుర్తించి ..వారిచేత రకరకాల పెర్ఫామెన్స్ లు చేయించి ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ను అందించే పని చేశారు.
ఇక టికెట్ టూ ఫినాలే టాస్క్ లో ప్రతీ రౌండ్ నుంచి బయటకు వెళ్ళేవారు.. వారి పాయింట్స్ ను ఎవరికైనా ఇవ్వచ్చు.. అయితే ప్రియాంక గేమ్ నుంచి బయటకు వెళ్తు తన పాయింట్స్ గౌతమ్ కు ఇవ్వగా రచ్చ మొదలైంది. ప్రియాంక.. గౌతమ్‌కి ఇవ్వడంతో అమర్ చాలా హర్ట్ అయ్యాడు. నేను వెదవనయ్యానని అమర్ తెగ బాధపడుతుండగా,మధ్యలో శోభ కాస్త నిప్పు రాజేసింది. దీంతో రకరకాల వాదనలు సాగాయి. చివరకు ప్రియాంక క్షమాపణలు చెప్పిన కూడా అమర్ సీరియస్‌గానే ఉన్నాడు. అయితే శోభ వారిద్దరి ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్మార్ట్ గా నటించింది. మొత్తానికి టాస్క్‌లో అమర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. అర్జున్ సెకండ్, గౌతమ్ మూడోవ స్థానంలో.. ఉన్నారు. ఇక టికెట్ టూ ఫినాలే కు మొదట ఎవరు వెళతారు అనేది తెలియాల్సి ఉంది.