హౌజ్‌లో తనకి ఎవరు ఇష్టమో చెప్పిన యావర్.. శోభా శెట్టి చాలా అతి చేస్తుందిగా..!

బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం అంతా ఉల్టాపుల్టాగానే సాగుతుంది. అయితే గత సీజన్స్ మాదిరిగానే ఈ టాస్క్‌లు నడుస్తున్నాయి. నామినేషన్స్ ప్రక్రియ ఈ సారి మరింత రచ్చగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు బూతులతో విరుచుకుపడతుండగా, హౌజ్ అయితే రణరంగంగా మారుతుంది. తాజ ఎపిసోడ్‌లో తేజ, శోభాశెట్టి మధ్య జరిగిన కన్వర్జేషన్ పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. ఈడు జోడు సెట్ అవుతుందని, ఆమె కోసం సిక్స్ ప్యాక్ చేస్తానని తేజ చెప్పడం కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ని పంచింది.ఇక కొద్ది సేపటి తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా, ఈ టాస్క్‌లో ప్రియాంక, శోభాశెట్టి, అమర్ దీప్, తేజ పాల్గొన్నారు.
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నీటిలో మునిగే వస్తువులను, మునగని వస్తువులను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఎక్కువగా గుర్తించిన ప్రియాంక కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచారు. శోభా శెట్టి రెండో స్థానంలో నిలవగా, తేజ, అమర్ దీప్ టై అయ్యింది. మళ్లీ ఈ ఇద్దరికి నిర్వహించగా, ఇందులో తేజ విన్ అయ్యారు. ఇక అమర్ దీప్ పోటీ నుంచి తప్పుకోవల్సి వచ్చింది. అయితే ముందుగా ఈ పోటీలో పాల్గొనే సమయంలో అమర్ దీప్, భోలే మధ్య కన్వర్జేషన్ కొంత హాట్‌గా సాగింది అని చెప్పాలి. అమర్ దీప్ అనవసరంగా భోలేని గెలకడం అందరికి కాస్త కోపాన్ని తెప్పించింది. అయితే తేజ, అమర్ దీప్ ల మధ్య జరిగిన టాస్క్ లో శోభా.. అమర్‌కి సిగ్నల్ ఇస్తుండగా, ఆయన పట్టించుకోలేదు.
అయితే ఈ ఇష్యూలో శోభా శెట్టి, తేజ మధ్య చిన్నపాటి రచ్చ జరిగింది. ఒకరిపై ఒకరు దారుణంగా అరుచుకున్నారు. ఇక మరో కెప్టెన్సీ కంటెండర్‌కి సంబంధించిన పోటీలో నలుగురు ప్రశాంత్, రతిక, యావర్,గౌతమ్ పాల్గొన్నారు. ఇందులో పల్లవి ప్రశాంత్ విన్ కాగా, రతిక రేసు నుంచి తప్పుకుంది. ఇక హౌజ్‌లో ఒకరికొకరు పులిహారలు కలుపుకోవడం కామే కదా. తాజాగా అశ్విని, యావర్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. హౌజ్‌లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారని అశ్విని.. యావర్‌తో చెప్పింది. బిగ్ బాస్ అంటేనే ఇలానే ఉంటుందిలే అంటూ ఆమెలో ఆమె అనేకుంది. ఇక అశ్విని.. యావర్‌ని హౌజ్‌లో ఎవరంటే ఇష్టం, ఎవరితో కనెక్ట్ అయ్యావని ప్రశ్నించింది.దీనికి మనోడు రతిక అని సమాధానం ఇచ్చాడు.ఇక శోభా శెట్టి వ్యవహారం ఎప్పటి మాదిరిగానే కాస్త అతిగా అనిపించింది. ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూ హైలైట్ కావాలని చూస్తుంది.