వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి చిరు త‌ల్లి మిస్.. కార‌ణం ఏంటంటే..!

వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి చిరు త‌ల్లి మిస్.. కార‌ణం ఏంటంటే..!

మెగా ఇంట ప్ర‌స్తుతం పెళ్లి సంద‌డి నెల‌కొంది. నిహారిక పెళ్లి త‌ర్వాత మెగా ఇంట పెద్ద ఎత్తున జ‌రుగుతున్న వేడుక ఇదే. కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్న వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి నవంబ‌ర్ 1న ఇటలీలో ఘ‌నంగా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్ప‌టికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన‌ట్టుగా తెలుస్తుంది. నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతుండ‌గా,ఈ జంట‌కి ఆశీర్వ‌చ‌నాలు అందించేందుకు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా ఇటలీ బయలు దేరి వెళ్లింది. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న భార్య అన్నాతో ఎయిర్ పోర్ట్‌లో క‌నిపించ‌గా, ఆ పిక్స్ వైర‌ల్ అయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీలో ముఖ్య‌మైన వ్య‌క్తి మాత్రం వీరి పెళ్లికి డుమ్మా కొడుతున్న‌ట్టుగా తెలుస్తుంది.

మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయిన అంజ‌నా దేవి వరుణ్, లావణ్యల పెళ్లికి హాజరు కావడం లేదట. దానికి కారణం ఏంటంటే.. ఈ వ‌య‌స్సులో ఆమె ఇటలీ వ‌రకు ఫ్లైట్లో జర్నీ చేయడం అంత సేఫ్ కాదని.. ఆమె ఆరోగ్య రీత్య ఇండియాలోనే ఉంచుతున్నారని ఫిలిం న‌గ‌ర్ టాక్. పెళ్లిని లైవ్‌లో చూస్తూ ఆ జంట‌కి ఆశీర్వ‌చ‌నాలు అందించ‌నుంద‌ట అంజ‌నా దేవి. ఆమె ఆరోగ్య‌ప‌రిస్థితుల కార‌ణంగా డాక్ట‌ర్స్ ఇటలీ వ‌ర‌కు తీసుకెళ్లొద్ద‌ని స‌జెస్ట్ చేయ‌డంతో అంజ‌నా దేవిని ఇటలీకి తీసుకెళ్ల‌డం లేద‌ని తెలుస్తుంది. అయితే హైద‌రాబాద్‌లో జరిగే రిసెప్ష‌న్‌కి మాత్రం అంజ‌నా దేవి వెళ్ల‌నుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి మెయిన్ పర్సన్ మిస్సింగ్ అంటూ ఈ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చల్ చేస్తుంది.

వరుణ్ తేజ్, లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన ముందుగా అక్కడికి వెళ్లి పెళ్లి పనులు అన్నింటిని దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇటలీలో వీరి ప్రేమ పుట్ట‌గా, అక్క‌డే పెళ్లి కూడా చేసుకోవాల‌ని ఈ జంట భావించింద‌ట‌. అందుకే కేవలం ప‌లువురు కుటుంబ స‌భ్యులు, అత్యంత సన్నిహితుల స‌మ‌క్షంలో వ‌రుణ్ – లావ‌ణ్య త్రిపాఠిలు ఏడ‌డుగులు వేయ‌నున్నారు.