డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్, రోహిత్ ఏడ్చారు.. మేమంతా చాలా బాధ‌ప‌డ్డామ‌న్న అశ్విన్

  • By: sn    breaking    Dec 01, 2023 10:13 AM IST
డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్, రోహిత్ ఏడ్చారు.. మేమంతా చాలా బాధ‌ప‌డ్డామ‌న్న అశ్విన్

ఈ సారి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొడుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. కొన్ని కోట్ల మంది కూడా భార‌త్ క‌ప్ కొడుతుంద‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. కాని వారి మనసులు ముక్కలయ్యాయి.అయితే జ‌ట్టులో ఉన్న క్రికెట‌ర్స్ సైతం క‌ప్ గెల‌వ‌డం ఖాయం అంటూ ఎంతో ధీమాగా ఉండ‌గా ఓట‌మి వారిని చాలా బాధించింది. అయితే ఓట‌మి త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేమ‌ర్స్ ఎలా ఫీల‌య్యార‌నే విష‌యం గురించి తాజాగా ర‌విచంద్ర‌న్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఓట‌మి చెందిన‌ప్పుడు రోహిత్, విరాట్ ఇద్దరూ ఏడ్చేశారు. వాళ్లను అలా చూసి నాక్కూడా చాలా బాధేసింది. టీం అద్భుతంగా ఆడిన‌ప్పుడు ఇలాంటి ఓట‌మి ప్ర‌తి ఒక్కరిని బాధించింది.

జ‌ట్టులో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ నాచురల్ లీడర్లు. వాళ్లిద్దరూ జట్టులో ఒక మంచి వైబ్ ఉండేలా చూసుకున్నారు అని చెప్పిన అశ్విన్..రోహిత్ కెప్టెన్సీపై కూడా ప్ర‌శంస‌లు కురిపించాడు. అందరూ ధోనీని ఉత్తమ కెప్టెన్‌గా పేర్కొంటారు. అయితే, రోహిత్ శర్మ కూడా ఉత్త‌మమైన‌వాడు. అందరి ఇష్టాయిష్టాలు అతనికి తెలుసు. ప్రతి ఒక్కరితో సమన్వయంతో ఉంటూ వారిని అర్ధం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. రోహిత్ చాలా కష్టపడతాడు. నిద్ర కూడా మర్చిపోయి మీటింగ్స్‌లో పాల్గొంటాడు. జట్టులో వేసే వ్యూహాలు కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి రోహిత్ ఎంతో కృషి చేస్తాడు.. ఇది భారత క్రికెట్‌లో అడ్వాన్స్‌డ్ స్థాయి కెప్టెన్సీ అని అశ్విన్ తెలియ‌జేశాడు.

ఫైన‌ల్‌తో పాటు కొన్ని మ్యాచ్‌ల‌లో కుల్దీప్, జ‌డేజా దారుణంగా విఫ‌ల‌మైన అశ్విన్‌ని కొన‌సాగించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. . అశ్విన్ తుది జ‌ట్టులో ఉంటే ఫైన‌ల్‌లో బౌలింగ్ ప‌రంగా టీమిండియా స్ట్రాంగ్‌గా ఉండేద‌ని కొంద‌రు అన్నారు. అయితే దీనిపై స్పందించిన అశ్విన్..విన్నింగ్ కాంబినేష‌న్‌ను మార్చ‌డానికి ఏ కెప్టెన్ అయినా ఒక‌టికి రెండుసార్లు ఆలోచిస్తాడ‌ని, రోహిత్ కూడా అలాగే ఆలోచించి త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌లేద‌ని తెలిపాడు.రోహిత్ స్థానంలో నేను ఉన్నా అదే చేసేవాడిని. అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని అనుకోవ‌డం కెప్టెన్ ఏం ఆలోచిస్తాడ‌న్న‌ది అత‌డి స్థానంలో ఉండి అర్థం చేసుకోవ‌డం చాలా ముఖ్యం అంటూ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.