బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో చుక్క‌లు చూపిస్తున్న ఇంగ్లండ్..500 వికెట్లు తీసి అరుదైన ఘ‌న‌త సాధించిన అశ్విన్

బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో చుక్క‌లు చూపిస్తున్న ఇంగ్లండ్..500 వికెట్లు తీసి అరుదైన ఘ‌న‌త సాధించిన అశ్విన్

ప్ర‌స్తుతం ఇంగ్లండ్-భార‌త్ మ‌ధ్య మూడో టెస్ట్ ర‌స‌వ‌త్తరంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో భార‌త బౌల‌ర్స్‌కి చుక్క‌లు చూపిస్తుంది. ముందుగా రెండో రోజు ఆట ప్రారంభించిన భార‌త్ 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112) ప‌రుగులు చేసి ఔట్ కాగా, ఆ త‌ర్వాత వ‌చ్చిన రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడ‌డంతో భార‌త్ మంచి స్కోరు సాధించింది. ఇక చివ‌ర‌లో . జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేయ‌డం విశేషంగా చెప్పుకోవాలి.

భార‌త్ ఆలౌట్ అయిన త‌ర్వాత ఇంగ్లండ్ ఆట‌గాళ్లు బ్యాటింగ్‌కి దిగారు . బెన్ డక్కెట్(118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) విధ్వంసకర శతకం చేయ‌డంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 2 వికెట్లకు 207 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డక్కెట్‌తో పాటు జోరూట్(9 బ్యాటింగ్) ఉన్నారు. అయితే ఓపెన‌ర్ జాక్ క్రాలీ(15), త‌ర్వాత వ‌చ్చిన ఓలిపోప్(39) తర్వగా ఔటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, సిరాజ్ తలో వికెట్ ద‌క్కింది. మ్యాచ్‌లో ఓపెనర్ జాక్ క్రాలీ వికెట్ అశ్విన్‌కి ద‌క్క‌డంతో 500 వికెట్స్ తీసిన బౌల‌ర్‌గా స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. క్రాలీ స్వీప్‌కి ప్ర‌య‌త్నించ‌గా, షార్ట్ ఫైన్ లెగ్‌లో రజత్ పాటిదార్ క్యాచ్ అందుకోవడంతో అశ్విన్ అరుదైన ఘనత ద‌క్కించుకున్నాడు.

అత్యంత వేగంగా 500 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి భారత బౌలర్‌గా.. రెండో స్పిన్నర్‌గా అశ్విన్ చరిత్రకెక్కాడు. అశ్విన్ 98 టెస్ట్‌ల్లో ఈ ఫీట్ సాధిస్తే.. కుంబ్లే 105 టెస్ట్‌ల్లో ఈ మైలురాయిని అందుకోవడం విశేషంగా చెప్పాలి.. ఓవరాల్‌‌గా వేగంగా 500 వికెట్లు తీసిన బౌల‌ర్స్‌లో టాప్‌లో శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీథరన్ ఉండ‌గా రెండో బౌల‌ర్‌గా అశ్విన్ ఉన్నాడు. అయితే 87 టెస్ట్‌ల‌లో అశ్విన్ కి ఈ రికార్డ్ ద‌క్క‌గా, మురళీథరన్ (87), అశ్విన్ (98), అనిల్ కుంబ్లే (105), షేన్ వార్న్ (108), మెక్‌గ్రాత్ (110) సాధించారు. బంతుల పరంగా వేగంగా 500 వికెట్లు సాధించిన రికార్డులో భారత్ తరఫున అగ్రస్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో అశ్విన్ నిలిచి స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు