నా వ‌యస్సు ప‌దేళ్లు.. 20 పెళ్లిళ్లు చేశారంటూ చిన్నారి పెళ్లి కూతురు షాకింగ్ కామెంట్స్

నా వ‌యస్సు ప‌దేళ్లు.. 20 పెళ్లిళ్లు చేశారంటూ చిన్నారి పెళ్లి కూతురు షాకింగ్ కామెంట్స్

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ అవికా గోర్. ఈ సీరియ‌ల్‌తో అవికాకి మంచి క్రేజ్ ద‌క్కింది. ఇక ఆ త‌ర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్ర‌మంలో రాజ్‌త‌రుణ్‌తో క‌లిసి మ‌రోసినిమా చేసింది. సినిమా చూపిస్త మామ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అంద‌రికి నచ్చ‌డంతో ఆ మూవీ కూడా మంచి హిట్టైంది. అయితే అవికా కెరీర్‌లో చాలా సినిమాలే చేసిన ఏ చిత్రం కూడా అంత పెద్ద విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం అవికా సినిమాల్లోనే కాకుండా ఓటీటీ ఒరిజినల్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా అవికా గోర్ నటిస్తున్నారు.

అవికా ఇప్పుడు ‘వధువు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో నందు, అలీ రెజాతో కలిసి అవికా గోర్ నటించారు. ఈ వెబ్ సిరీస్‌ను ఎస్వీఎఫ్ బ్యానర్‌పై శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మించారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ‘వధువు’ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండ‌గా, ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా అవికా గోర్ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది . తెరపై తాను చాలాసార్లు పెళ్లికూతురిని అయ్యానని ఆ అనుభవాలను చెప్పుకొచ్చింది. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ చేసేప్పుడు తన వయసు పదేళ్లు కాగా, అప్పుడు నాకు పెళ్లంటే ఏంటో తెలియ‌దు.

అస‌లు పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా మెల‌గాలి అనే విష‌యాల‌పై స‌రైన అవ‌గాహ‌న ఉండేది కాదు. అప్పుడు నేను డైరెక్ట‌ర్‌ని అడిగి క్లారిటీ తీసుకున్నాను. ‘పెళ్లి, వధువు అంటే ఏంటి అనే విషయాలు నటిగా మారడం వల్ల త్వరగా అన్ని విషయాలు నేర్చుకోగలిగా. నటిగా మారడం వల్ల నా వ్యక్తిగత జీవితంలో సమయాన్ని కోల్పోయానంటూ అవికా చెప్పుకొచ్చింది..అయితే నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నా అని ఆనందం వ్య‌క్తం చేసింది అవికా. ఆన్‌స్క్రీన్‌పై ఇప్పటి వరకు కనీసం 20 సార్లు తాను పెళ్లి చేసుకుని ఉంటానని చెప్పిన అవికా, ఎప్పుడు బోర్ రాలేదు. అలా రెడీ కావ‌డం నాకు ఇష్టం అని అవికా స్ప‌ష్టం చేసింది.