Avika Gor|కాపాడతాడని జాబ్ ఇస్తే బాడీగార్డ్ నాతోనే తప్పుగా ప్రవర్తించాడన్న హీరోయిన్
Avika Gor|చిన్నారి పెళ్లికూతురుగా ఇండియా వైడ్‌గా పాపులారిటీని తెచ్చుకుంది అవికా గోర్. ఈ భామ నటించిన ఈ సీరియల్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారు.చిన్న వయసులోనే తన నటనతో ఎంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను దక్కించుకుంది. డ్యాన్సర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా పలు షోలు చేసింది.చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. చిన్నారి పెళ్లికూతురు సీ
Avika Gor|చిన్నారి పెళ్లికూతురుగా ఇండియా వైడ్‌గా పాపులారిటీని తెచ్చుకుంది అవికా గోర్(Avika Gor). ఈ భామ నటించిన ఈ సీరియల్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారు.చిన్న వయసులోనే తన నటనతో ఎంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను దక్కించుకుంది. డ్యాన్సర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా పలు షోలు చేసింది.చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ చేసే టైమ్‌లోనే మార్నింగ్ వాక్, పాఠ్‌శాల, తేజ్ వంటి హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. 2013లో వచ్చిన ‘ఉయ్యాల జంపాల’(Uyyala Jampala)సినిమాతో హీరోయిన్‌గా మారింది అవికా గోర్.

నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టయింది. విలేజ్ డ్రామా కాన్సెప్ట్‌తో మంచి కుటుంబ కథగా ప్రేక్షకులను మెప్పించింది. తొలి సినిమాతోనే సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ అవార్డు కూడా దక్కించుకుంది. అయితే ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన అవికా గోర్ ఇప్పుడు మాత్రం బోల్డ్‌గా దర్శనమిస్తూ ఔరా అనిపిస్తుంది.అవికా(Avika)ని చూసి చాలా మంది షాకయ్యారు. అయితే ఈ భామ అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఉంటుంది. హాట్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
తనను కాపాడతాడని ఉద్యోగం ఇచ్చిన ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. తనను రక్షించాల్సిన బాడీగార్డు (Body Guard)తనతో అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించింది. ఓ ఈవెంట్‌లో బాడీగార్డు తనను దారుణంగా తాకాడని అవికాగోర్ తన అనుభవాలు వివరించింది. అయితే రెండు సార్లు అతడు నాతో అలాగే ప్రవర్తించాడని, ఆ సమయంలో అతినిని చూసి గట్టిగా ఏంటని అడగ్గా, అప్పుడు సారీ చెప్పాడు.ఇక ఆ సమయంలో సంఘటనని వదిలేశాను . అలా ప్రవర్తించినప్పుడు అది ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ని వారికి తెలియదని.. అలా ప్రవర్తించినప్పుడు అతడిని కొట్టే ధైర్యం ఉంటే.. ఈపాటికి చాలా మందిని కొట్టేదానిని అంటూ అవికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కూడా అవికా పేర్కొంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram