బాబోయ్.. భూమిక అంటే న‌మ్మేలా లేదుగా..ఈ వ‌యస్సులో ఇంత గ్లామ‌ర్ షోనా?

బాబోయ్.. భూమిక అంటే న‌మ్మేలా లేదుగా..ఈ వ‌యస్సులో ఇంత గ్లామ‌ర్ షోనా?

ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రు గ్లామ‌ర్ షోతో ర‌చ్చ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కుర్ర భామ‌లు, సీనియ‌ర్ హీరోయిన్స్ సైతం అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో భూమిక ముందు ఉంటుంది. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ ఖుషి చిత్రంతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి. ఆ త‌ర్వాత భూమిక సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. అనంత‌రం సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు వ‌దిన‌, అత్త వంటి పాత్ర‌లు పోషిస్తుంది. అయితే ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు కాగా, చివ‌రిగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది.

నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక త‌న అందాల‌తో ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేయాల‌ని భావిస్తుంది. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భూమిక షేర్ చేసిన ఫొటోస్ తో నెటిజన్లు, అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఖుషీలో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.భూమిక ప్రస్తుతం గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుండ‌గా, ఈ అమ్మ‌డు తాజాగా టైట్ ఫిట్ బ్లాక్ టాప్, జీన్స్ షార్ట్ లో థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది .ఇలా భూమిక‌ని చూసి రోజు రోజుకి భూమిక వయసు తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఒకవైపు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న భూమిక చావ్లా ఇటీవ‌ల హోటల్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది విష‌యాన్ని భూమిక సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఇండియాలోని టాప్ టూరిస్ట్ డెస్టినేష‌న్ గోవాలో భూమిక త‌న కొత్త హోటల్‌ను ప్రారంభించింది. ”గోవాలో మా కొత్త వెంచర్ సమర వెల్నెస్ హోటల్ అంటూ భూమిక ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. దీంతో ఆమెకి అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.