Bhumika | వైజాగ్‌లో ‘యుఫోరియా’ సాంగ్ లాంచ్.. పవన్ గురించి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు
Bhumika | సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషల్ డ్రామా ‘యుఫోరియా’ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌లో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Bhumika | సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషల్ డ్రామా ‘యుఫోరియా’ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌లో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువగా అభిమానులు, ప్రేక్షకులు తరలిరావడంతో ఈ ఈవెంట్ ఒక స్టార్ హీరో సినిమా వేడుకను తలపించేలా మారింది. భారీ ఎత్తున హాజరైన జనసందోహాన్ని చూసి చిత్ర దర్శకుడు గుణశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా పాటను ఇంత ఘనంగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ స్థాయిలో స్పందన రావడం సినిమా ఇప్పటికే ప్రజల్లోకి చేరిందనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ఈవెంట్ తర్వాత ‘యుఫోరియా’పై చర్చ మరింత పెరుగుతుందని, విడుదల రోజున సినిమాకు మంచి ఓపెనింగ్ తప్పక దక్కుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భూమిక పాత్రే హైలైట్
‘యుఫోరియా’ సినిమాలో భూమిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తల్లి పాత్రలో భూమిక నటన ఈతరం తల్లులకు ఒక గైడ్‌లైన్‌లా ఉంటుందని, ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో ఆలోచింపజేసేలా ఆమె క్యారెక్టర్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. సినిమా కథను విన్నప్పటి నుంచే భూమిక ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకంగా ఉన్నారని, ఇది తనకు ఒక సెకండ్ ఇన్నింగ్స్‌కు బలమైన సినిమా అవుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు.
భూమిక స్పీచ్ హైలైట్స్
వైజాగ్‌లో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో భూమిక మాట్లాడుతూ… ఈ ఈవెంట్‌కు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా పూర్తి కెరీర్‌లో ‘యుఫోరియా’ టాప్‌లో నిలిచే సినిమా అవుతుంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా పిల్లల తల్లిదండ్రులు తప్పక కనెక్ట్ అయ్యి చూస్తారు. థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒక మంచి ఆలోచనతో బయటకు వస్తారు” అని చెప్పారు.
అలాగే పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ… ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాను. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయనతో కలిసి నటించిన ప్రయాణం నాకు ఎప్పటికీ స్పెషల్” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ‘యుఫోరియా’ సినిమాలో భూమికతో పాటు సారా అర్జున్, నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ కుమార్తెలు నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించగా, రాగిణి గుణ సమర్పిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram