Tiger Spotted In Yadadri : తోడు కోసమే పెద్దపులి ఇంత దూరం వచ్చిందా.. వీడియో వైరల్

మహారాష్ట్ర తడోబా నుంచి యాదాద్రి భువనగిరి వరకు పెద్దపులి సంచారం. సీసీ కెమెరాలో చిక్కిన వీడియో వైరల్‌గా మారింది.

Tiger Spotted In Yadadri : తోడు కోసమే పెద్దపులి ఇంత దూరం వచ్చిందా.. వీడియో వైరల్

విధాత : మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వాయర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలో సంచరిస్తున్న పెద్దపులి సంచారం వీడియో సీసీ కెమెరాకు చిక్కింది. తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు రికార్డయ్యాయి. ఈ వీడియోలో పెద్దపులి దర్జాగా ఓ కల్వర్ట్ మీదుగా ప్రవహిస్తున్న కాలువ నీటిలో నుంచి నడుచుకుంటూ వెలుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇబ్రహీంపురం, దత్తాయపల్లి, వీరారెడ్డిపల్లి, కందమల్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో సంచరిస్తూ వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉన్న పశువులపై పులి దాడి చేస్తూ వస్తుంది.

తోడు కోసమే యాదాద్రి భువనగిరి జిల్లా వరకు పెద్దపలి?

మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్ నుంచి మగ పులి ఆసిఫాబాద్, జగిత్యాల సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నర్సాపూర్ జిల్లాల మీదుగా యాదాద్రి జిల్లాలోకి వచ్చినట్లుగా ఇప్పటికే ఫారెస్టు అధికారులు గుర్తించారు. ఆడపులి తోడు కోసం వెతుక్కుంటూ మగపులి 375 కిలోమీటర్లు ప్రయాణించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు పెద్దపులి వచ్చినట్లుగా భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి పెద్దపులి రావడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం ఆసక్తికరం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి క్షేత్ర సమీపంలోని గ్రామాల్లో ప్రస్తుతం పెద్దపులి సంచారం కనిపిస్తుంది. పులి కదలికలను పసిగట్టడానికి అడవిలోని పలు బ్లాకుల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పులి కనిపించినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని అటవీశాఖ అధికారులు కోరారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి :

Viral Video : బిగ్ అనకొండ..చూసేయండి వీడియో
Himachal Pradesh : శునకం విశ్వాసం.. గడ్డకట్టే చలిలోనూ యజమాని మృతదేహానికి 4 రోజులపాటూ కాపలాగా.. కన్నీరు తెప్పిస్తున్న దృశ్యం