Pailla Prakash Reddy : టీజీపీఏ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ రెడ్డి
టీజీపీఏ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పైళ్ల ప్రకాశ్ రెడ్డి ఎన్నిక! యాదాద్రి జిల్లా వలిగొండకు చెందిన ప్రకాశ్ రెడ్డి నియామకంపై విద్యాశాఖలో హర్షం. గురుకులాల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి.
విధాత : తెలంగాణ గురుకుల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ (TGPA) సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ చెందిన పైళ్ల ప్రకాశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయనను టీజీపీఏ సభ్యులు అభినందిస్తూ… గురుకుల విద్యా వ్యవస్థలో అనుభవజ్ఞుడిగా, విద్యాపరమైన సమస్యలపై లోతైన అవగాహన కలిగిన నాయకుడిగా పైళ్ల ప్రకాశ్ రెడ్డి నూతను బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
గతంలో వివిధ స్థాయిల్లో గురుకుల విద్యాసంస్థల అభివృద్ధికి ప్రిన్సిపల్స్ , సిబ్బంది సమస్యల పరిష్కారానికి తీసుకున్న చొరవ ఆయనను టీజీపీఏ సెంట్రల్ సెక్రటరీ స్థాయికి చేర్చిందన్నారు. ఈ సందర్భంగా వలిగొండకు చెందిన విద్యాసంస్థల ప్రతినిధులు, నాయకులు కాసుల వెంకన్న, పబ్బు వెంకటరమణ, గరిసె రవి, పాలకూర వెంకటేశం, గంగాధర్ దయాకర్, నూతనగంటి వెంకటేశం, బెలిదే శ్రీనివాస్ లు ప్రకాశ్ రెడ్డికి తమ అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి :
Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇదే.. బెంగాలీ, అస్సాం సంప్రదాయ వంటకాలతో
Andhra Pradesh : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ ఖాళీ!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram