Viral Video : బిగ్ అనకొండ..చూసేయండి వీడియో

ఏఐ నకిలీ వీడియోల మధ్య నిజమైన భారీ అనకొండ వీడియో వైరల్‌గా మారింది. దక్షిణ అమెరికా నదిలో కనిపించిన పసుపు అనకొండ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

Viral Video : బిగ్ అనకొండ..చూసేయండి వీడియో

విధాత : ఏఐ రాకతో కృత్రిమ సాంకేతికత సృష్టితో మనుషులతో పాటు వన్యప్రాణులు, పాములు, జలచరాలకు సంబంధించి అశ్చర్యకరమైన రీతిలో నకిలీ వీడియోలు జోరుగా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజమైన వన్యప్రాణుల విశేషాలను సైతం నెటిజన్లు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓ భారీ అనకొండ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది నిజమైన వీడియో కావడంతో నెటిజన్లు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో, అమెజాన్ అడవుల్లో ఎక్కువగా మనుగడ సాగించే కొండ చిలువలు, అనకొండలు భారీ బరువుతో, పొడవుతో కనిపిస్తుంటాయి. పొడవైన అనకొండల వీడియోలు ఎప్పుడొచ్చినా అవి వైరల్ కావడం గమనార్హం.

దక్షిణ అమెరికా జలమార్గంలో సేదతీరుతున్న పసుపు అనకొండ వీడియోలో భారీగా కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పసుపు రంగులోని మచ్చల అనకొండ నది ఒడ్డున ఓ చెట్టు మొద్దుకు చుట్టుకుని తను తిన్న ఆహారాన్ని జీర్జించుకునే పనిలో ఉంది. పనిలో పనిగా నీళ్లలోని చేపలు, చిరు ప్రాణులను గుటకాయ స్వాహా చేసేందుకు అక్కడ మకాం వేసింది. వీడియోలో అనకొండ కదలికలు దాని భారీ పరిణామాన్ని చూడటంలో ఆసక్తిరేపుతుంది.

ఇవి కూడా చదవండి :

Komatireddy Venkat Reddy : కొడుకు పేరుతో హైటెక్ స్కూల్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
Plum Farming | కాసులు కురిపిస్తున్న ‘రేగు’ కాయ‌లు.. రూ. ల‌క్ష పెట్టుబ‌డితో రూ. 6 ల‌క్ష‌ల సంపాదించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్