Harish Shankar | వివాదాల నుంచి వేడుకల వరకు.. సోషల్ మీడియాలో హరీష్ శంకర్ తీసుకున్న నిర్ణయం వైరల్
Harish Shankar |టాలీవుడ్‌లో అరుదుగా కనిపించే ఒక ఆసక్తికర పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా అభిమానులు హీరోలు లేదా దర్శకులను ట్రోల్ చేయడం, విమర్శించడం పరిపాటే. కానీ ఈసారి కథ అలా కాదు. గతంలో తనను విమర్శించిన అభిమానులనే మళ్లీ దగ్గరకు తీసుకుంటూ, “పాతవన్నీ మర్చిపోదాం” అన్న భావనతో స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన చర్య అందరి దృష్టిని ఆకర్షించింది.
Harish Shankar |టాలీవుడ్‌లో అరుదుగా కనిపించే ఒక ఆసక్తికర పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా అభిమానులు హీరోలు లేదా దర్శకులను ట్రోల్ చేయడం, విమర్శించడం పరిపాటే. కానీ ఈసారి కథ అలా కాదు. గతంలో తనను విమర్శించిన అభిమానులనే మళ్లీ దగ్గరకు తీసుకుంటూ, “పాతవన్నీ మర్చిపోదాం” అన్న భావనతో స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. కమర్షియల్ సినిమాలకు ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఒక దశలో పవన్ కళ్యాణ్ అభిమానులతో చోటు చేసుకున్న అభిప్రాయ భేదాల నేపథ్యంలో, తన పనిపై అనవసర ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో కొందరి అకౌంట్లను బ్లాక్ చేసిన విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
కాలం గడిచింది… పరిస్థితులు మారాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, మ్యూజిక్ అప్డేట్స్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను మరింత పెంచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే గతంలో విమర్శలు చేసిన కొందరు అభిమానులు కూడా ఇప్పుడు దర్శకుడి పనితీరును మెచ్చుకుంటూ ముందుకొచ్చారు. తాజాగా ఓ అభిమాని బహిరంగంగా క్షమాపణలు చెబుతూ, “మా తప్పులు మర్చిపోయి మమ్మల్ని అన్‌బ్లాక్ చేయండి… ఉస్తాద్ భగత్ సింగ్‌ను కలిసి సెలబ్రేట్ చేద్దాం” అంటూ చేసిన విజ్ఞప్తి వైరల్‌గా మారింది.
దీనికి స్పందించిన హరీష్ శంకర్, “ఇప్పుడు పండుగ వాతావరణం ఉండాలి” అంటూ పాత విభేదాలను పక్కన పెట్టి పలువురు అభిమానులను అన్‌బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పెద్దమనసు నిర్ణయంతో సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒకప్పుడు విమర్శలతో నిండిన వాతావరణం, ఇప్పుడు అదే సినిమా చుట్టూ పండుగలా మారడం టాలీవుడ్‌లో అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇక హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram