గ్రౌండ్‌లోకి ప్ర‌వేశించిన ఎద్దు.. వెంబ‌డించ‌డంతో ప‌రుగెత్తిన క్రికెట‌ర్లు.. వీడియో

క్రికెట్ ఆడుతుండ‌గా.. ఆక‌స్మాత్తుగా రెండు ఎద్దులు మైదానంలోకి ప్ర‌వేశించాయి. ఇక అక్క‌డున్న క్రికెట‌ర్ల‌ను అది వెంబ‌డించ‌డంతో.. వారు భ‌యంతో ప‌రుగులు పెట్టారు.

గ్రౌండ్‌లోకి ప్ర‌వేశించిన ఎద్దు.. వెంబ‌డించ‌డంతో ప‌రుగెత్తిన క్రికెట‌ర్లు.. వీడియో

ప్ర‌తి ఊరిలో క్రికెట్ అభిమానులు ఉంటారు. సెల‌వు దొరికిందంటే చాలు గ్రామ శివార్ల‌లో ఉండే మైదానాల్లో వాలిపోతారు. కొన్ని సంద‌ర్భాల్లో అదే మైదానాల్లో టోర్న‌మెంట్‌లు కూడా నిర్వ‌హిస్తుంటారు. అయితే క్రికెట్ ఆడుతుండ‌గా.. ఆక‌స్మాత్తుగా రెండు ఎద్దులు మైదానంలోకి ప్ర‌వేశించాయి. ఒక ఎద్దు ఏకంగా పిచ్‌పై ప‌రుగెత్తింది. ఇక అక్క‌డున్న క్రికెట‌ర్ల‌ను అది వెంబ‌డించ‌డంతో.. వారు భ‌యంతో ప‌రుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే.. ఒక మారుమూల ప్రాంతంలో చిన్న‌పాటి క్రికెట్ టోర్న‌మెంట్ జ‌రుగుతోంది. అక్క‌డ టెన్నిస్ బాల్‌తో కొంద‌రు క్రికెట్ ఆడుతున్నారు. అక్క‌డికి రెండు ఎద్దులు వ‌చ్చాయి. వాటిలో ఒక‌టి ఒక్క‌సారిగా మైదానంలోకి దూసుకొచ్చి హ‌ల్‌చ‌ల్ చేసింది. దాని దూకుడు చూసి అంపైర్‌తో స‌హా బౌలింగ్ చేసే కుర్రాడు, ఇత‌ర‌ ఆట‌గాళ్లంతా ప్రాణ భ‌యంతో ప‌రుగులు తీశారు. ఓ ఎక్స్ యూజ‌ర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూడ్డానికి న‌వ్వు తెప్పించేలా ఉన్నా వెన్నులో వ‌ణుకుపుట్ట‌డం మాత్రం ఖాయం.