సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. అప్ప‌టి హీరో చంద్ర‌మోహ‌న్ క‌న్నుమూత‌

సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. అప్ప‌టి హీరో చంద్ర‌మోహ‌న్ క‌న్నుమూత‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల‌లో చంద్ర‌మోహ‌న్ ఒక‌రు. ఆయ‌న హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించారు. అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న కొన్నాళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉంటున్న చంద్ర‌ మోహ‌న్  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 9 గంటల 45 నిమిషాలకు హృద్రోగంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం చంద్ర మోహన్ వయసు 82 సంవత్సరాలు కాగా, ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. ఇటీవ‌ల ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ర‌ణించిన స‌మ‌యంలో చంద్ర‌మోహ‌న్ మీడియా కంట పడ్డారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న చాలా వీక్ గా క‌నిపించారు. 

నేడు, రేపు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చంద్ర‌మోహ‌న్ భౌతిక కాయాన్ని ఉంచి సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో న‌టించిన చంద్ర‌మోహ‌న్ ఎంతో మంది హీరోయిన్స్‌కి లైఫ్ ఇచ్చారు.స్టార్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న‌వారంద‌రు కూడా చంద్ర‌మోహ‌న్ స‌ర‌స‌న న‌టించిన వారే. ఆయ‌న ప‌క్కన న‌టిస్తే వారి ఫేట్ మార‌డం ఖాయం అన్న‌ట్టుగా ఉండేది. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించినవారే. 1942 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించారు చంద్రమోహన్‌. 932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్‌.. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న చంద్ర‌మోహ‌న్ ఈ లోకాన్ని విడిచిపోవ‌డం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి లోటు అని చెప్పాలి.

అప్పట్లో కామెడీ చిత్రాలు తీయాలన్న దర్శకులకు వరంగా లభించాడు చంద్ర మోహన్.బి ఎన్ రెడ్డి తీసిన రంగుల రాట్నం సినిమా ద్వారా 1964 లో పరిచయం అయ్యాడు చంద్ర మోహన్. కృష్ణం రాజు వంటి ఆరడుగుల హీరోను పక్కన పెట్టి చంద్ర మోహన్ కి డైరెక్టర్ అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత హీరో వేషాలు రాకపోయినా పెద్ద హీరోల సినిమాల్లో చిన్న వేషాలు, విలనీ వేషాలు వేసి ఎంత‌గానో అల‌రించాడు.ఆ తర్వాత 70 ల వరకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే హాస్య కథ చిత్రాలకు మెయిన్ హీరో గా అవతారం ఎత్తాడు.ఫ్యామిలీ సినిమాలు అయితే శ్రీధర్, మురళి మోహన్, రంగనాథ్ వంటి వారు చేస్తే, 80 వ దశకం వచ్చే సరికి కొత్త నిర్మాత ఎవరైనా సరే చంద్ర మోహన్ ఉండాల్సిందే అన్నట్టు గా ప‌రిస్థితి మారింది.