CM Revanth Reddy’s: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
సీఎల్పీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి లేచి బయటకు వెళ్లడం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ఓ వైపు నేను ఇంత సీరియస్గా చెబుతుంటే జైవీర్ రెడ్డి అలా వెళ్తున్నారు.. ఇంత నాన్ సీరియస్గా ఉంటారా అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.

CM Revanth Reddy’s: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన తీరు..వ్యూహాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి వేదికైంది. సీఎల్పీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి లేచి బయటకు వెళ్లడం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ఓ వైపు నేను ఇంత సీరియస్గా చెబుతుంటే జైవీర్ రెడ్డి అలా వెళ్తున్నారు.. ఇంత నాన్ సీరియస్గా ఉంటారా అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.
చాలామంది సీరియస్ గా పనిచేయట్లేదని… ఒకసారి గెలవడం గొప్పకాదని.. మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప అన్నారు. బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటే.. మీపై వాళ్లు అభ్యర్థిని పెట్టరనుకుంటున్నారా.. బీఆర్ఎస్ గురించి మీకు చాలా తక్కువ తెలుసు.. వాళ్ల గురించి నాకు బాగా తెలుసని..రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నింటికీ ధైర్యంగా ముందుకెళ్లాలి’ అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాలు అంటే పిల్లలాట అనుకుంటున్నారా.. సీరియస్గా వచ్చే ఎన్నికల్లోనూ ఎలా గెలవాలి అనే ప్లాన్తో పని చేయండని హితవు పలికారు.
మీటింగ్ జరుగుతుండగా బయటకు వెళ్లడం డిసిప్లైన్ కాదని జైవీర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో మూడుసార్లు ఎంపీల అటెండెన్స్ తీసుకుంటారని గుర్తు చేశారు. అందరం కలిసి పనిచేస్తేనే మరోసారి మన ప్రభుత్వం వస్తుందన్నారు. కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావొద్దన్నారు. ఇక నుంచి అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని.. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆరోపణలలో చర్చలలో తిప్పికొట్టడంలో ఆలసత్వం పనికిరాదన్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ పెట్టుకుందామని సూచించారు.
అందరి పనితీరుపై చర్చిద్దాం’ అంటూ సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేలు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించారు. జైవీర్ రెడ్డికి తనకు తెలియకుండా ఏ పనులు చేయొద్దని మంత్రులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై సీరియస్ అయినా విషయం తెలుసుకుని సమావేశంలో చివరలో తిరిగి చివర్లో జైవీర్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు.