CP Radhakrishnan | జార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ బాధ్యతలు..!
CP Radhakrishnan | జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు పుదుచ్చేరితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది. తమిళిసై సౌందర రాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అదనంగా బాధ్యతలు అప్పగించారు. తమిళనాడుకు చెందిన తమిళిసై త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆమె పదవికి రాజీనామా చేయగా.. ఆమె రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తమిళిసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ పదవి చేట్టిన తొలి మహిళగా నిలిచారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram