సిద్ధార్థ్‌ని పెళ్లి చేసుకోబోతున్న అదితి మొద‌టి భ‌ర్త ఎవ‌రు.. ఆయ‌న‌కి పెళ్లైందా లేదా?

సిద్ధార్థ్‌ని పెళ్లి చేసుకోబోతున్న అదితి మొద‌టి భ‌ర్త ఎవ‌రు.. ఆయ‌న‌కి పెళ్లైందా లేదా?

సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ..ఈ జంట గ‌త కొద్ది రోజులుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. కొన్ని రోజులుగా వీరిద్ద‌రు డేటింగ్ చేస్తుండ‌గా, ఇటీవ‌ల పెళ్లి చేసుకున్నారంటూ జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ని కొట్టి పారేస్తూ తాము ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న‌ట్టు తెలియ‌జేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఇద్దరు త‌మ చేతి రింగులు చూపిస్తూ, ఆమె తనకి ఎస్‌ చెప్పిందని సిద్ధార్థ్‌, అతను తనకు ఎస్‌ చెప్పాడని అదితి పోస్ట్‌లు పెట్టారు. దీంతో వారిద్ద‌రు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే సిద్ధార్థ్ కి ఇది మూడో పెళ్లి కాగా, అదితికి రెండో వివాహం అవుతుంది. అయితే అదితి మొదటి వివాహం గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. ఆమె చేసుకున్న‌ది ఎవ‌రిని, విడాకులు ఎందుకు ఇచ్చింది అనే దాని గురించి మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు.

అదితి తాను న‌టిగా కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్ల‌లో త‌న వైవాహిక బంధాన్ని పులిస్టాప్ పెట్టి.తాను విడాకులు తీసుకున్న త‌ర్వాతే న‌టిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి సంద‌డి చేసింది. అయితే ఇప్పుడు తాను హీరో సిద్ధార్థ్ తో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న క్ర‌మంలో ఆమె మొద‌టి భ‌ర్త ఎవ‌రు, ఏం చేస్తుంటారు, ఆయ‌న మరో పెళ్లి చేసుకున్నాడా వంటి వివ‌రాల గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు నెటిజ‌న్స్. అయితే అదితి మొద‌టి భ‌ర్త పేరు స‌త్య‌దీప్ మిశ్రా కాగా, ఆయ‌న గ‌త ఏడాది వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్‌ వివియన్ రిచర్డ్స్ కుమార్తె ‘మసాబా గుప్తాను’ వివాహం చేసుకున్నారు. ఇక సత్యదీప్ లాగే మసాబాకు కూడా ఇది రెండో పెళ్లి.

మ‌సాబా గ‌తంలో నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకొని అత‌ని నుండి విడిపోయి స‌త్య‌దీప్ ని వివాహం చేసుకుంది. ఈ ఇద్ద‌రు ఇప్పుడు అన్యోన్యంగానే ఉంటున్నారు. అయితే స‌త్య‌దీప్, మసాబా ఇద్దరూ నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ మసాబా మసాబా లో కనిపించి సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం స‌త్య‌దీప్ ప‌లు సినిమాల‌లో కూడా క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు. గ‌తంలో న్యాయ‌వాదిగా ప‌ని చేసిన స‌త్య‌దీప్ ఆ త‌ర్వాత న‌టుడి ఎంట్రీ ఇచ్చి ‘బాంబే వెల్వెట్’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘ఫోబియా’, ‘విక్రమ్ వేద’ వంటి చిత్రాలలో మెరిసాడు.అయితే అత‌నితో అదితి విడిపోవ‌డానికి కార‌ణం ఆమెని సినిమాల‌లోకి వెళ్లొద్ద‌ని రిస్ట్రిక్ష‌న్ పెట్ట‌డ‌మే అయి ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు.