అభిమానుల మ‌ధ్య తెగ చిందులు వేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌,మృణాల్..హోలీ సెల‌బ్రేష‌న్స్ అదుర్స్

  • By: sn    breaking    Mar 25, 2024 11:08 AM IST
అభిమానుల మ‌ధ్య తెగ చిందులు వేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌,మృణాల్..హోలీ సెల‌బ్రేష‌న్స్ అదుర్స్

వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌తం అవుతున్న విజయ్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయిక‌గా న‌టిస్తుంది.. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌గా, మేక‌ర్స్ మూవీకి సంబంధించి తెగ ప్ర‌మోష‌న్స్ జ‌రుపుతున్నారు. ఈ ప్ర‌మోష‌న్స్ ప్ర‌తి ఒక్కరిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఈ రోజు హోలీ సంద‌ర్భంగా సినిమా నుండి మూడో సాంగ్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ మ‌ధ్య హోలీ రంగులతో ఫ్యామిలీ స్టార్ మూవీ టీం సంద‌డి చేసింది. ఫ్యాన్స్ పై రంగులు జల్లుతూ హోలీ సెలబ్రేషన్స్ ని జరుపుకుంటూ డాన్స్ వేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు రౌడీ బాయ్.

మృణాల్ ఠాకూర్, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. హోలీ సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ‘మధురము కదా..’ సాంగ్ కి గోపి సుందర్ సంగీతం అందించ‌గా, ఆ మెలోడీ సాంగ్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు కూడా హోలీ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటున్నారు. ప్ర‌స్తుతం హోలీ సెల‌బ్రేష‌న్స్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. పరుశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో గతంలో గీతగోవిందం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఈ మూవీ కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ..నేను చదువుకునే రోజుల్లో హోళీ పండుగ అంటే చాలా భ‌య‌పడేవాడిని. రంగులు పూస్తే అవి అలాగే ఉండిపోతాయని ఇంట్లోనే ఉండిపోయేవాడిని. అదే టైమ్ లో పరీక్షలు జరుగుతుంటే చాలా మంది మొహం నిండా రంగులు పూసేవారు. కాని ఈ రోజు మీ అంద‌రితో ఇలా హోలీ జ‌రుపుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. మన లాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక పర్సన్ కథ ఈ సినిమా కాగా, ఇది ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంది అని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు.