ఈ వినాయ‌క మంత్రాలు ప‌ఠిస్తే.. అదృష్టం, ధ‌న‌లాభం వ‌రిస్తుంద‌ట‌..!

ఏ శుభ‌కార్యమైన స‌రే వినాయ‌కుడి పూజ‌తోనే ప్రారంభిస్తాము. ఎందుకంటే విఘ్నాలకు అధిప‌తి విఘ్నేశ్వ‌రుడు క‌నుక‌. వినాయ‌కుడు జ్ఞానం ప్ర‌సాదించి, గొప్ప విజ‌యాల‌ను అందిస్తాడ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

ఈ వినాయ‌క మంత్రాలు ప‌ఠిస్తే.. అదృష్టం, ధ‌న‌లాభం వ‌రిస్తుంద‌ట‌..!

ఏ శుభ‌కార్యమైన స‌రే వినాయ‌కుడి పూజ‌తోనే ప్రారంభిస్తాము. ఎందుకంటే విఘ్నాలకు అధిప‌తి విఘ్నేశ్వ‌రుడు క‌నుక‌. వినాయ‌కుడు జ్ఞానం ప్ర‌సాదించి, గొప్ప విజ‌యాల‌ను అందిస్తాడ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. మ‌నస్ఫూర్తిగా గ‌ణ‌నాథుడిని పూజిస్తే అదృష్టం వ‌రించ‌డంతో పాటు ధ‌న‌లాభం కూడా సిద్ధిస్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. కోరిన కోరిక‌లు కూడా తీరుస్తాడ‌ని న‌మ్మ‌కం. మ‌రి అలాంటి ఏక‌దంతుడిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి, ఆయ‌న అనుగ్ర‌హం పొందానికి కొన్ని మంత్రాలు ప‌ఠిస్తే త‌ల‌పెట్టిన ప‌నుల్లో విజ‌యం ల‌భిస్తుంద‌ని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఆ మంత్రాలు ఇవే..

“ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా”.. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయి, త‌ల‌పెట్టిన ప‌నుల‌న్నీ విజ‌య‌వంతం అవుతాయ‌ట‌. జ్ఞానం, సంపద, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయట.

“ఓం గం గణపతియే నమః”.. ఈ గణేశ మంత్రం చాలా శక్తివంతమైనదని విశ్వాసం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వ్యాపారంలో విజయం సాధిస్తారని న‌మ్మ‌కం. ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే పని విజయవంతం అవుతుందని సూచిస్తున్నారు.

“ఓం ఏకదంతాయ విద్మహే, వక్రతుండా ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్”.. ఈ మంత్రాన్ని పఠించే వారు జ్ఞానం పొందుతారు. మంచి తెలివితేటలు సొంతం అవుతాయని చెబుతున్నారు.

“ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్య కర్త్రే సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్ సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా”.. ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే మానసిక ప్రశాంతత, తలపెట్టిన పనుల్లో విజయం లభించి.. ఆర్థిక లాభం చేకూరుతుందట.

“ఓం గణేష్ రిన్నమ్ ఛింది వరేణ్యం హూం నమః ఫుట్”.. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో సంపద, సంతోషం లభిస్తాయి.

“ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వ జనమ్మే వశమానాయ స్వాహ”.. ఈ మంత్రం జపించడం వల్ల జీవితంలో శాంతి, అదృష్టం, విజయం దక్కుతాయట.

“ఓం విఘ్ననాశాయ నమః”.. జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని, ఎటువంటి లోటూ లేకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ప్రయోజనం చేకూరుతుందట.

“ఓం గజకర్ణకాయ నమః”.. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతుందట.