Ola S1 X Price | ఓలా నుంచి 2కొత్త స్కూటర్లు.. అడ్వాన్స్ బుకింగ్ షురూ
భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ఓలా మార్కెట్‌లోకి రెండు కొత్త వేరియంట్లను తీసుకువస్తున్నది.

Ola S1 X Price | భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ఓలా మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా కొత్త వేరియంట్స్‌ను లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ఎక్స్‌లో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకువస్తుండగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెండు స్కూటర్ల ఫీచర్స్, ధరలు గురించి వాహనదారులు తీస్తున్నారు. ఓలా ఎస్1 ఎక్స్‌లోని రెండు వేరియంట్లు డ్యూయెల్ టోన్‌తో వస్తుండగా.. డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, రైజ్డ్ హ్యాండిల్‌బార్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ పీస్ సీట్, 12 ఇంచ్ స్టీల్ వీల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ ఉన్నాయి.
రైడర్ సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్స్ (ఫ్రంట్-రియర్ వీల్స్), కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయెల్ రియర్ షాక్ అబ్సార్బర్స్ ఉన్నాయి. ఒక వేరియంట్ 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండగా.. మరొకదాంట్లో 4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. రెండు 6కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్కి కనెక్ట్ చేసి ఉంటాయి. అయితే, మొదటి స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 143 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు. రెండో స్కూటర్‌లో 190 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఇక ధర విషయానికి వస్తే 3కేడబ్ల్యూ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ.89,999 నిర్ణయించగా.. 4కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1,09,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలవగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొనుగోలుదారులకు డెలివరీ చేసే అవకాశం ఉన్నది.
అయితే, ఓలా వినియోగదారులకు కీలక వార్త చెప్పింది. పోర్ట్‌పోలియోలోని వాహనాల్లో బ్యాటరీలపై ఎనిమిదేళ్ల పాటు వారంటీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. క్వాలిటీ, సర్వీస్‌కు కట్టుబడి ఎక్స్‌టెండెడ్ వారంటీని ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. మరో వైపు పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను సైతం విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం 1000 ఛార్జర్స్ ఉండగా.. వచ్చే త్రైమాసికానికి 10వేలకు తీసుకెళ్లనున్నట్లు చెప్పింది.