కీర్తిపై అమర్ దీప్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. చెప్పు తీసుకొని కొడతానంటూ వార్నింగ్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మరో పది రోజుల్లో ముగియనుంది. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌ని గెలిపించాలని వారి వారి ఫ్యాన్స్ చాలా కష్టపడుతున్నారు. సామాన్యులతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి సపోర్ట్ అందిస్తున్నారు. అయితే ఒకరికి సపోర్ట్‌గా మాట్లాడడం వలన వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ లిస్ట్ లో కార్తీక దీపం ఫేమ్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్ చేరింది.
గత వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన గౌతమ్‌కు సపోర్టుగా మాట్లాడినందుకు కీర్తిని కొందరు బూతులు తిట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా అమర్ దీప్ ఫ్యాన్స్ అసభ్యకర పదజాలంతో కీర్తిని టార్గెట్ చేస్తూ దారుణమైన బూతులు తిడుతుండగా, ఆవేదనకి లోనైన ఈ బిగ్ బ్యూటీ సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది. గౌతమ్ కృష్ణతో నాకు ఎలాంటి పరిచయం లేదు. అయితే ఇండివిడ్యువల్ గా ఆడుతున్నాడని అతనికి సపోర్ట్ చేశాను. ఎవరికి సపోర్ట్ చేయాలనేది నా పర్సనల్. నేను ప్రతి ఒక్కరి ఐడీలు నోటు చేసుకుంటాను. మీ ఇంటికి వచ్చి రోడ్డు మీద కొడతాను. మీ తల్లి చేతే కొట్టిస్తాను… అని కీర్తి భట్ ఫైర్ అయ్యారు.
అమ్మాయిలను గౌరవించండి. నాది తప్పు ఉంటే మీ కాళ్ళు మొక్కుతా. దయచేసి దూషించకండని కీర్తి భట్ అన్నారు. ఇక కీర్తి లవర్, కాబోయే భర్త కార్తిక్ కూడా స్పందించాడు. ఇండైరెక్ట్‌గా అమర్‌దీప్ ఫ్యాన్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. గౌరవనీయులైన వెధవలు, సన్నాసులు, పోరంబోకుల కోసమే ఈ వీడియో చేస్తున్నాను అంటూ మొదలు పెట్టిన కీర్తి లవర్.. ఆమె బిగ్‌బాస్‌లో తనకి నచ్చినవాళ్లకి సపోర్ట్ చేస్తుంది.. నువ్వు ఎవడురా అడగటానికి.. నీకు ఏం రైట్ ఉంది తనను కొశ్చన్ చేయడానికి.. పర్సనల్ మెసేజ్‌లు పెట్టడం ఏంటిరా చెత్త వెధవ.. యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ చూసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా.. ఒక అమ్మాయిని అలా తిట్టావ్ అంటే నువ్వు కడుపుకి అన్నం తింటున్నావో లేక ఇంకేమైనా తింటున్నావో.. ఇలానే నీ తల్లిని తిడితే నువ్వు ఊరుకుంటావా. “హౌస్‌లో తన ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు ఉన్నారు.. అలా అని అందరికీ తన సపోర్ట్ చేయలేదు కదా.. అందుకే న్యూట్రల్‌గా ఉంది.. నేను ఇలా ఎప్పుడూ మాట్లాడను.. కానీ తను నిన్నటి నుంచి అలా ఫీలవుతుంది.. అయినా తను ఎంత మేకప్ వేసుకుంటే నీకెందుకురా భయ్.. నువ్వు కొనిచ్చావా.. హౌలేగా.. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు.. అడగటానికి నువ్వు ఎవడు.. ఇదేనా నేర్పించేది మీ ఇంట్లో వాళ్లు అంటూ దారుణంగా మండిపడ్డాడు.