Keerthi | చిచ్చు రేపిన కీర్తి భట్ కామెంట్స్ .. డ్రెస్ జారిన డ్యాన్స్ చేయాలా?
Keerthi | బుల్లితెరపై సందడి చేస్తోన్న ‘బీబీ జోడీ సీజన్–2’ మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచింది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జంటలుగా పోటీ పడుతున్న ఈ షోలో తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్‌గా మారింది. ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి, డీమాన్ పవన్‌తో పాటు, తాజా ప్రోమోలో చోటు చేసుకున్న డ్యాన్స్ ఇష్యూ ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తోంది.
Keerthi | బుల్లితెరపై సందడి చేస్తోన్న ‘బీబీ జోడీ సీజన్–2’ మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచింది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జంటలుగా పోటీ పడుతున్న ఈ షోలో తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్‌గా మారింది. ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి, డీమాన్ పవన్‌తో పాటు, తాజా ప్రోమోలో చోటు చేసుకున్న డ్యాన్స్ ఇష్యూ ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తోంది. బ్లాక్‌బస్టర్ థీమ్‌లో భాగంగా కీర్తి భట్ – ఆర్జే చైతూ జోడీ, భీష్మ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘వాటే బ్యూటీ’ కి స్టేజ్‌పై నర్తించారు. అయితే డ్యాన్స్ జరుగుతుండగానే కీర్తికి తన కాస్ట్యూమ్ కారణంగా అసౌకర్యం ఎదురైంది. దీంతో ఆమె వెంటనే పెర్ఫార్మెన్స్‌ను నిలిపివేసి, అదే విషయాన్ని జడ్జీలకు తెలియజేసింది. ఈ అనుకోని పరిణామంతో స్టేజ్‌పైనా, ఆడిటోరియంలోనూ క్షణకాలం నిశ్శబ్దం నెలకొంది.
ఈ సందర్భంగా కీర్తి మరో అవకాశం ఇవ్వాలని కోరగా, జడ్జీలు పరస్పరం చర్చించుకుని తమ నిర్ణయాన్ని వెల్లడించారు. లైవ్ షోలో ఒక్క అవకాశం మాత్రమే ఉంటుందని సదా చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై కీర్తి స్పందిస్తూ, “డ్రెస్ సమస్య ఉన్నా డ్యాన్స్ కొనసాగించాలన్నదే మీ నిర్ణయమా?” అని ప్రశ్నించడంతో వాతావరణం హీట్ ఎక్కింది. దీనికి శ్రీదేవి తక్షణమే స్పందించి, “అలా ఎవరూ అనలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు” అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా కీర్తి తన వాదనను వెనక్కి తీసుకోకుండా, “నా తప్పుతో ఆగిపోయినా ఒప్పుకుంటాను. కానీ డ్రెస్ విషయంలో రాజీ పడలేను” అని స్పష్టంగా చెప్పింది.
ఈ సమయంలో శేఖర్ మాస్టర్ మధ్యలోకి వచ్చి, “మాకూ ఆడపిల్లలు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా బలవంతంగా డ్యాన్స్ చేయమని చెప్పం” అంటూ పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు. అయితే ‘ఒకే ఛాన్స్’ అనే నిర్ణయంపైనే జడ్జీలు నిలబడటం పట్ల ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. “పెర్ఫార్మెన్స్ కంటే సేఫ్టీ ముఖ్యం”, “కీర్తి అడిగింది న్యాయమే” అంటూ చాలామంది ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చుట్టూ ఏర్పడిన వివాదం కారణంగా, ఈ వారాంతంలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. షోలో ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది చూడాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram