షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లిన కృతి శెట్టి ప‌రువు తీసారు.. పాపం సైలెంట్‌గా న‌వ్వి ఊరుకున్న బేబ‌మ్మ‌

షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లిన కృతి శెట్టి ప‌రువు తీసారు.. పాపం సైలెంట్‌గా న‌వ్వి ఊరుకున్న బేబ‌మ్మ‌

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి దూసుకొచ్చిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో తొలి సినిమాలో అద‌ర‌గొట్టింది. ఈ క్ర‌మంలో కృతి శెట్టికి వ‌రుస ఆఫర్స్ క్యూ క‌ట్టాయి. మూడు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ హిట్ కావ‌డంతో కృతి శెట్టి గోల్డెన్ లెగ్ అని అంద‌రు భావించారు. కట్ చేస్తే వ‌రుస‌గా మూడు ఫ్లాపులు వ‌చ్చాయి. దీంతో అమ్మ‌డికి ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమా అవ‌కాశాలు రావడం లేదు. కాని కోలీవుడ్‌లో మాత్రం దున్నేస్తుంది. వ‌రుస సినిమా అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ త‌న క్రేజ్ పెంచుకుంటుంది.రీసెంట్ గానే ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో కలిసి నటించబోతున్నట్టు ప్రకటించింది.

ప్రదీప్ రంగనాథన్ – కృతిశెట్టి కాంబోలో ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్జే సూర్య కృతికి తండ్రిగా క‌నిపించ‌నున్నారు. మ‌రోవైపు కృతి శెట్టి వా వాతిరై, శ‌ర్వానంద్ 35 చిత్రాల‌లోను న‌టిస్తుంది. మ‌ల‌యాళంలోను ఓ సినిమా చేస్తుంది. ఇక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కి కూడా హాజ‌రై తెగ సంద‌డి చేస్తుంది. అయితే తాజాగా ఓ షాప్ ఓపెనింగ్‌కి హాజ‌రైన కృతి శెట్టికి విచిత్ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. అక్కడ ఓ అభిమాని మీ స్కంధ సినిమా బాగుంది అని కృతి శెట్టితో అన్నాడు. ఓ అవునా అంటూ నవ్వేసింది..స్కందలో నేను లేను అంటూ కూల్‌గా రిప్లై ఇచ్చింది. అంటే స్కందలో హీరోయిన్ ఎవరన్నది కూడా ఆ వ్య‌క్తికి గుర్తు లేదు

రామ్ తో క‌లిసి శ్రీలీల సంధ చేయ‌గా, అభిమాని మాత్రం కృతి శెట్టి అనుకొని అలా మాట్లాడాడు. ఇక శ్రీలీల, కృతి శెట్టిలు ఒకే లైన్‌లో పరిగెడుతున్నారని, ఇద్దరికీ పెద్ద తేడా లేదు.శ్రీలీలకు పెళ్లి సందడి, ధమాకా చిత్రాలు బాగా కలిసి వచ్చాయి. ఆ రెండు చిత్రాలతో శ్రీలీలకు మంచి పేరు వచ్చింది. రామ్‌తో చేసిన స్కంధ, వైష్ణవ్ తేజ్‌తో చేసిన ఆది కేశవ, నితిన్‌తో తీసిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా అన్నీ బోల్తా కొట్టేశాయి. బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి శ్రీలీలని కొంత కాపాడిన‌… ఈ ఏడాది గుంటూరు కారం అంటూ మరో ఫ్లాపును మూట గట్టుకుంది. మొత్తానికి కృతి శెట్టి, శ్రీలీల జర్నీ ఒకేలా సాగుతుంది.