Site icon vidhaatha

ఇంట్లో ఖాళీగా ఉన్న నాగ చైత‌న్య‌.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించాడు నాగ చైత‌న్య‌. ఆయ‌న సినిమాలు హిట్,ఫ‌ట్ అనేవి ప‌క్క‌న పెడితే ప్ర‌తి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తూ ఉంటాడు. ఇటీవ‌ల అనేక ప్ర‌యోగాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు చైతూ. ఇప్పుడు ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌తో రాబోతున్నాడు.అమెజాన్ సంస్థ కోసం దూత్ అనే వెబ్ సిరీస్ చేయగా, విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అత్యధిక బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్లు అమెజాన్ సంస్థ వెల్లడించింది.

నాగ చైతన్య వెబ్ సిరీస్‌ను డిసెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా అమెజాన్ సంస్థ ప్రకటించింది. మరోవైపు నాగ చైతన్య తన కెరీర్ 23వ సినిమాను యంగ్ డైరెక్టర్ చందూ మొండేటితో చేసందుకు రెడీ అయ్యాడు . అయితే ఇటీవ‌ల సెల‌బ్రిటీలు అంద‌రు ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాపై దృష్టిపెడుతున్న విష‌యం తెలిసిందే. ట్విట్టర్ , లేకుంటే.. ఇన్ స్టా గ్రామ్ అది కాకుంటే ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటివి.. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ పామ్స్ లో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు కావల్సిన ఎంట‌ర్‌టైన్మెంట్ ఏదో ర‌కంగా ద‌క్కేలా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను ఎక్స్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తోపాటు యూట్యూబ్‌ ద్వారా అందిస్తున్నారు.

సినిమాల ప్ర‌మోష‌న్ కోసం సోష‌ల్ మీడియాని వాడుతున్నారు. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు చైతూ. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు.ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు స‌మాధానాలు ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ జుట్టు, గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా..? అని ప్రశ్నించాడు. దీనికి చైతూ బదులిస్తూ.. ఆరు నెలలుగా జాబ్‌ లేదని, ఇంట్లో ఖాళీగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అనంత‌రం తాను హీరోగా నటిస్తున్న చందూ మొండేటి తెరకెక్కించనున్న సినిమా కోసం ఈ లుక్ అంటూ వివ‌ర‌ణ ఇచ్చాడు నాగ చైత‌న్య‌.

Exit mobile version